కళాభారతి జమునకు ‘నవరస నట కళావాణి’ బిరుదుతో సత్కరించారు

- September 17, 2017 , by Maagulf
కళాభారతి జమునకు ‘నవరస నట కళావాణి’ బిరుదుతో సత్కరించారు

రాజ్యసభ సభ్యుడు టి. సుబ్బరామిరెడ్డి పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా విశాఖపట్నంలోని కళావాణి ఆడిటోరియంలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రజానటి, కళాభారతి జమునని నవరస కళావాణి బిరుదుతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో సినీ ప్రముఖులు వాణిశ్రీ, జయసుధ, జయప్రద, శారద, జయచిత్ర, సుశీల, పరుచూరి బ్రదర్స్‌, కాంచన తదితరులు పాల్గొన్నారు.
టీఎస్సార్‌ పుట్టినరోజు సందర్భంగా విశాఖలోని సిరిపురంలో దేశంలోని ప్రధాన దేవాలయాల అర్చకులకు సత్కార కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా టీఎస్సార్‌ మాట్లాడుతూ.. అందం.. ఐశ్వర్యం.. అధికారం అశాశ్వతమని, ఆధ్యాత్మిక శక్తే శాశ్వతమని అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com