రాజుగారి గది 2' ట్రైలర్ వచ్చేస్తోంది త్వరలో
- September 18, 2017
ఇప్పటివరకు 'రాజుగారు' ఎలా ఉన్నారో చూశారు... మరో రెండు రోజుల్లో రెండో 'రాజుగారిగది' ఎలా ఉండబోతోందో చూడబోతున్నారు. ఈ నెల 20న 'రాజుగారిగది 2' ట్రైలర్‌ను విడుదల చేస్తున్నారు. అక్కినేని నాగార్జున కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రమిది. ఓంకార్ దర్శకుడు. పీవీపీ సినిమా, మ్యాట్నీ ఎంటర్‌టైన్మెంట్, ఓక్ ఎంటర్‌టైన్మెంట్స్ నిర్మిస్తున్నాయి.
రెండేళ్ల క్రితం విడుదలై మంచి విజయం సాధించిన 'రాజుగారిగది' చిత్రానికిది కొనసాగింపు. ఇందులో నాగార్జున మైండ్ రీడింగ్ చేసే వ్యక్తిగా కనిపిస్తారని సమాచారం. ఈ సినిమాలో సమంత, కాజల్ అగర్వాల్, సీరత్ కపూర్, అశ్విన్ బాబు, వెన్నెల కిషోర్, షకలక శంకర్ తదితరులు నటిస్తున్నారు. గతేడాది మలయాళంలో వచ్చిన 'ప్రేతమ్' ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు సమాచారం. అందులో జయసూర్య పోషించిన పాత్రలో ఇక్కడ నాగార్జున కనిపిస్తున్నారట.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







