నయనతార తన లవర్ బర్త్ డే ని న్యూయార్క్ లో సెలెబ్రేట్ చేసుకున్నారు
- September 19, 2017
నయనతార గత కొన్ని రోజులుగా కొంచెం సీక్రెట్ గా మెయింటైన్ చేసిన రిలేషన్ ను ఇప్పుడు కెమెరాల ముందుకు తీసుకొచ్చేసింది. సింగిల్ స్టేటస్ ను డబుల్ గా మార్చుకోవడానికి ముహూర్తం దగ్గర్లోనే ఉందంటూ లవర్ తో ఎంజాయ్ చేస్తోన్న జాలీమూమెంట్స్ ను షేర్ చేసింది నయన్. మరి ఈ లేడీ సూపర్ స్టార్ ఫింగర్ కు రింగ్ తొడగబోయే రింగ్ మాస్టర్ ఎవరో వివరాల్లోకి వెళ్తే...
శింబు, ప్రభుదేవాలతో ప్రేమ కు శుభంకార్డ్ వేసిన నయన తార చాలా కాలం సోలో లైఫ్ నే లీడ్ చేసింది. నయన్ విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో నానుమ్ రౌడీ థాన్ సినిమాలో నటిస్తున్న సమయంలో వీరిద్దరి మద్య ప్రేమ మొదలైంది. వీరి ప్రేమ సహజీవనం వరకూ వెళ్లింది.. కొన్ని సార్లు నయన్, విఘ్నేష్ లకు పెళ్లి అనే వార్తలు కూడా వినిపించాయి.. కానీ ఈ వార్తలపై పెదవి విప్పని నయన్ బాయ్ ఫ్రెండ్ విషయంలో సీక్రెట్ ని మెయిన్ టెన్ చేసింది.. కానీ నయన్ పెళ్లి జీవితంలో అడుగు పెట్టాలని భావిస్తున్నట్లుందేమో.. ఇక విఘ్నేష్ తో ఉన్న రిలేషన్ ని బయట పెడుతున్నది..
కొన్నాళ్లుగా తన బాయ్ ఫ్రెండ్ తో ఉన్న హ్యాపీ మూమెంట్స్ ను బయటకు రిలీజ్ చేస్తోంది. రీసెంట్ గా విఘ్నేష్ బర్త్ డే సెలబ్రేషన్స్ ను న్యూయర్క్ లో సెలబ్రేట్ చేసిన నయన్, ఆ ఫోటోస్ ను షేర్ చేసి, పెళ్లికి రెడీ అన్నట్లుగా ఫోజ్ పెట్టింది. ఇదంతా చూస్తోంటే సౌత్ లో ఫుల్ బిజీగా ఉన్న నయనతార, ఆ సినిమాలను పూర్తి చేసి పెళ్లి బాట పట్టనున్నది అనిపిస్తుంది.
తాజా వార్తలు
- జహ్రా PACI శాఖలో సేవలు నిలిపివేత..!!
- భారత్–యూఏఈ సంబంధాల బలోపేతంలో భారతీయ ప్రవాసుల పాత్ర కీలకం: అర్జున్ రామ్ మేఘ్వాల్
- అంతర్జాలంలో అలరించిన ప్రవాస బాలల సాంస్కృతిక ప్రతిభ
- ప్రపంచంలోనే తొలి కమర్షియల్ U6GHz మొబైల్ నెట్‌వర్క్‌ను ప్రారంభించిన e& UAE
- ఉగ్రవాద నిరోధంలో రాజీ లేదన్న భారత్..అమెరికాకు జైశంకర్ వార్నింగ్..!
- వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్‌లో హార్ట్ హెల్త్ అవేర్నెస్, CPR కార్యక్రమం
- మధ్య ఆసియాతో దక్షిణ భారతదేశ కనెక్టివిటీని మరింత బలోపేతం చేసిన జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్
- ఈస్ట్-వెస్ట్ పైప్‌లైన్‌ను పునరుద్ధరించిన సౌదీ..!!
- ఒమన్‌లో క్రిస్టల్ మెత్ తో దొరికిన ఆసియన్స్..!!
- రాస్ అల్ ఖైమాలో అమ్మకానికి ‘హాంటెడ్ ప్యాలెస్’..!!







