రోడ్డు ప్రమాదం: ఎమిరేట్ ఫుట్‌బాల్ ప్లేయర్ సురక్షితం
- September 21, 2017
ఎమిరేటీ ఫుట్‌బాల్ ప్లేయర్ మర్వాన్ మొహమ్మద్, రోడ్డు ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడ్డాడు. ఇటీవలే యూత్ టీమ్‌లో చేరిన మొహమ్మద్, రస్ అల్ ఖైమా నుంచి దుబాయ్‌కి తన వాహనంలో వస్తుండగా, వేగంగా వెళుతున్న మరో కారు మొహమ్మద్ కారుని ఢీకొంది. ఈ ఘటనలో మొహమ్మద్ ప్రయాణిస్తున్న కారు ధ్వంసమయ్యింది. ఆ వైపుగా ఇంకెలాంటి భారీ వాహనాలూ రాకపోవడంతో పెను ప్రమాదం దక్కింది. ఎలాంటి గాయాలూ కాకపోవడంతో, మొహమ్మద్ గురువారం నుంచి తిరిగి ప్రాక్టీస్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. రోడ్డు ప్రమాదం నుంచి మొహమ్మద్ తప్పించుకున్నారనీ, అయితే ఆయన ప్రయాణిస్తున్న లెక్సస్ కారు మాత్రం ధ్వంసమయ్యిందని అధికారులు తెలిపారు. ఈ కేసు విచారణ కొనసాగుతోందని వారు అన్నారు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







