సనాతన ధర్మం, సంస్కృతి, సంప్రదాయాల తో శోభాయమానంగా వెలుగుతున్న గల్ఫ్ తీరం

- October 31, 2015 , by Maagulf

గల్ఫ్ 

గత కొంతకాలం వరకు కూడా  కేవలం ఒక సామాజిక ధర్మానికే ప్రాధాన్యత ఇస్తూ మిగిలిన ధర్మాలకు అడ్డుకట్ట వేసే వారని, పరమత  సహనం తక్కువని ఒక పెద్ద అపవాదు ప్రాచుర్యం లో ఉండేది. అయితే ప్రస్తుతం ఆ మాట మరుగున పడి భిన్నత్వం లో ఏకత్వం దిశగా సాగి పోతోంది ఈ తీరం. ప్రపంచ దేశాలలో భారత దేశం తరువాత , అగ్ర రాజ్యాలకు దీటుగా, ఒక వైపు తమ రాజరిక పంధాను కొనసాగిస్తూనే మరో వైపు ప్రజాస్వామ్య వ్యవస్థ కు స్ఫూర్తి గా నిలుస్తూ చరిత్ర లో ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంటోంది. 

అందుకే గత దశాబ్ద కాలం లో ఎన్నడూ లేనంత స్థాయి లో  సనాతన ధర్మం, సంస్కృతి, సంప్రదాయాల వెలుగు రేఖల కేంద్ర బిందువై అలరారుతోంది.  ఇది గొప్ప శుభ పరిణామం గా చెప్పుకోవచ్చు . 

ముఖ్యంగా భారతీయుల విషయానికి వచ్చినట్లయితే సనాతనం అంటే ప్రాణమని, అనుష్టాన బలం తో ఆత్మను ప్రణవ శక్తీ తో లయం చేసి,  ధార్మిక పరిరక్షణ అనే జీవనది లో నీటి బిందువులు గా మారి తమ జన్మ సార్ధకత కై నిరంతరం శ్రమించే ఔన్నత్యం కలిగినవారు.  

వేదోప బ్రహ్మణ మైన చతు:షష్టి కళలు ఆ నిర్వికార, నిరామయుని లీలా సాదృశ్యం గా భావించి   అజరామరమైన శాస్త్రీయ సంగీత, నృత్య, అభినయాలతో కళాంజలి అర్పిస్తూ భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు పెద్ద పీట వేసి  ఈ గల్ఫ్ తీరాన్ని సుశోభితం చేస్తున్న సిరి ( ధార్మిక సిరి ) కలిగిన శ్రీమంతులకు  అభివందనములు. ఇటువంటి శ్రీమంతులకు ఆవాసాన్ని కల్పించిన  ఇక్కడి సామ్రాజ్య సార్వ భౌములకు ఆత్మీయ అభివాదం తెలుపుతూ నా ఈ గల్ఫ్ తీరం కీర్తి ఆచంద్ర తారర్కమై శోభిల్లాలని కోరుకుంటూ 

 

మీ లో ఒకడు 

 

సుబ్రహ్మణ్య శర్మ, UAE   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com