పాజిటివ్ రెస్పాన్స్ తో రాబోతున్న మహేష్ స్పైడర్

- September 23, 2017 , by Maagulf
పాజిటివ్ రెస్పాన్స్ తో రాబోతున్న మహేష్ స్పైడర్

దసరా కానుకగా వస్తున్న మరో క్రేజీ చిత్రం స్పైడర్. ఈ సినిమా రిలీజ్ కి ఇంకా నాలుగు రోజులే టైమ్ ఉంది. దీంతో ఇప్పుడు అందరి చూపు స్పైడర్ మీదే ఉంది. మురుగదాస్ డైరెక్షన్లో బైలింగ్వల్ ప్రాజెక్ట్ గా మహేష్ బాబు చేసిన స్పైడర్ పై ఉన్న అంచనాల వల్ల, తెలుగు రాష్టాల్లోనే కాక, ఓవర్సీస్, కర్ణాటక, తమిళనాడులోనూ ఈ చిత్రాన్ని భారీగా రిలీజ్ చేయడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. 
సూపర్ స్టార్ మహేష్ బాబు స్టార్ డైరెక్టర్ మురుగదాస్ కాంబినేషన్ లో తెరకెక్కిన స్పైడర్ సినిమాను ఎన్.వి.ప్రసాద్, ఠాగూర్ మధు కలసి సంయుక్తంగా నిర్మించారు. ఈ మూవీతో మహేష్, కోలీవుడ్లో ఎంట్రీ ఇస్తున్నాడు. అందుకే సినిమాపై అంచనాలు మరింత ఎక్కువగా ఉన్నాయి. ఈ నెల 27న ఒకే రోజు తెలుగుతో పాటు తమిళ్ లోనూ స్పైడర్ విడుదలకాబోతుంది.
స్పై థ్రిల్లర్ కాన్సెప్ట్స్ తో దాదాపు 125 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు నిర్మాతలు. ఇక మురుగదాస్ స్పెషల్ కేర్ తీసుకుని మరి ఈ సినిమాని తీశాడు. విజువల్ ఎఫెక్ట్స్ కూడా ఈ సినిమాలో ఉన్నాయి. మహేష్ బాబు లుక్ పరంగా కొత్తగా ఉన్నాడు. హారిస్ జైరాజ్ సంగీతం ఆకట్టుకుంటోంది. సంతోష్ శివన్ కెమెరా వర్క్ ఎక్స్ ట్రార్డినరీగా ఉంటుందట. స్పైడర్ లో యాక్షన్ ఎపిసోడ్స్ సినిమాకి హైలైట్ అంటున్నారు. స్పైడర్ లో ముఖ్యంగా చెప్పాల్సింది నెగిటివ్ రోల్ గురించి. ఈ పాత్రని డైరెక్టర్ ఎస్.జే.సూర్య పోషించాడు. సినిమాకి ఈ పాత్ర కూడా హైలైట్ అంటోంది టీమ్. ఇక మహేష్ కి జోడీగా క్రేజీ హీరోయిన్ రకుల్ నటించింది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com