మితిమీరిన అభిమానంతో హీరో శ్రీకాంత్ పై దాడి
- September 23, 2017
హైదరాబాద్: హీరో శ్రీకాంత్ ఇంట్లోకి చొరబడిన ఓ సైకో, తనలో మరో వ్యక్తి ఉన్నాడంటూ వీరంగం చేశాడు. శ్రీకాంత్ పై దాడికి దిగి కలకలం సృష్టించాడు. అతన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు తెలిపిన మరిన్ని వివరాల ప్రకారం, కర్నూలు జిల్లాకు చెందిన బీ వెంకటేశ్ (29) పలువురు ప్రముఖుల ఇళ్లలో వంట మనిషిగా పనిచేశాడు. వెంకటేశ్ కు శ్రీకాంత్ అంటే చాలా అభిమానం. మూడేళ్ల క్రితం ఆయన ఇంట్లో కూడా కొంతకాలం పనిచేశాడు. అయితే, పనితీరు బాగోలేకపోవడం, సైకోలా ఉండటంతో తొలగించారు. ఇక శ్రీకాంత్ తనకు తరచూ కలలోకి వస్తున్నాడని, ఎన్నిమార్లు కలిసేందుకు వెళ్లినా అనుమతించడం లేదని చెబుతూ, నిన్న శ్రీకాంత్ ఇంట్లోకి ప్రవేశించాడు. వాచ్ మెన్ అడ్డుకోవడంతో అతన్ని కొట్టి, అక్కడున్న ఏపీ 10 ఏఎస్ 0789, ఏపీ 09 సీఎల్ 9414 కార్లను ధ్వంసం చేశాడు.
కారు డ్రైవర్ పై దాడి చేసి, శ్రీకాంత్ బెడ్ రూమ్ వైపు పరుగు తీశాడు. ఆ సమయంలో మేడ దిగి వస్తున్న శ్రీకాంత్ ను మెడపట్టి మెట్లపై నుంచి తోశాడు. తృటిలో శ్రీకాంత్ కు ప్రమాదం తప్పింది. ఈ సమయంలో శ్రీకాంత్ భార్య ఊహ, వారి పిల్లలు ఇంట్లో లేరు. ఆపై సమాచారం అందుకున్న పోలీసులు, అరెస్ట్ చేసేందుకు వెళ్లగా వారిపైనా దాడికి ప్రయత్నించాడు. కష్టం మీద అతన్ని అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు. పోలీసులు విచారించగా, తనలోని మరో వ్యక్తిని శ్రీకాంత్ స్వయంగా పిలిచాడని, అసలు వెంకటేశ్ ఈ పని చేయలేదని చెప్పడంతో పోలీసులు తలపట్టుకున్నారు. మితిమీరిన అభిమానంతో అతను సైకోలా మారి ఈ పని చేశాడని చెప్పిన పోలీసులు, అతనిపై క్రిమినల్ కేసులు పెట్టినట్టు తెలిపారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







