కుమారి 21ఎఫ్‌ చిత్ర ఆడియో విడుదలైంది

- October 31, 2015 , by Maagulf
కుమారి 21ఎఫ్‌ చిత్ర ఆడియో విడుదలైంది

 రాజ్‌ తరుణ్‌, హెబ్బాపటేల్‌ జంటగా కొత్త దర్శకుడు సూర్యప్రతాప్‌ దర్శకత్వంలో తెరకెక్కిన 'కుమారి 21ఎఫ్‌' చిత్ర ఆడియో విడుదలైంది. హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో చిత్ర బృందం సమక్షంలో అల్లు అర్జున్‌ ముఖ్య అతిథిగా ఈ ఆడియో విడుదల జరిగింది. ఈ చిత్రానికి టాలీవుడ్‌ రాక్‌స్టార్‌ దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందించారు. రజినీకాంత్‌, ఐశ్వర్యరాయ్‌ల సూపర్‌హిట్‌ కాబినేషన్‌లో వచ్చిన 'రోబో' చిత్రానికి పనిచేసిన ప్రముఖ సినిమాటోగ్రఫర్‌ రత్నవేలు ఈ చిత్రానికి పని చేయడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. సుకుమార్‌ రైటింగ్స్‌ బ్యానర్‌పై నూతన దర్శకుడు, కొత్త మాటల రచయిత వంటి ఎందరికో అవకాశం కల్పిండంపై పలువురు హర్షం వ్యక్తం చేశారు. ప్రముఖ నిర్మాత దిల్‌రాజు చేతుల మీదుగా చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఆడియో సీడీని నటుడు అల్లు అర్జున్‌ ఆవిష్కరించారు. ఈ చిత్రం ఆడియో విడుదల సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక కాన్టెస్ట్‌ విజేతలకు నటుడు అల్లు అర్జున్‌ చేతుల మీదుగా బహుమతులను అందించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com