హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ విమానాశ్రయంలో దివ్యాంగుల కోసం వీల్ చైర్ లిప్ట్

- September 25, 2017 , by Maagulf
హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ విమానాశ్రయంలో దివ్యాంగుల కోసం వీల్ చైర్ లిప్ట్

హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ విమానాశ్రయంలో దివ్యాంగుల కోసం వీల్ చైర్ లిప్ట్ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చారు. దేశంలో ఇలాంటి సదుపాయాన్ని కల్పించిన మొదటి విమానాశ్రయంగా ఈ వియానాశ్రయం నిలిచింది.  వెర్టి-లిప్ట్ అని పిలిచే ఈ లిప్ట్ సాయంతో దివ్యాంగులు తమ బ్యాగేజీ కౌంటర్‌కి, చెకిన్ కౌంటర్‌కి త్వరగా చేరుకునే అవకాశం కలగనుంది.  వారు ఎక్కువసేపు ఎదురుచూడకుండా ఉండేందుకు యాక్సెసిబుల్ ఇండియా క్యాంపెయిన్‌లో భాగంగా ఈ లిప్ట్ సౌకర్యాన్ని కల్పించారు.  గత నెలలో ప్రారంభించిన ప్యాసింజర్ ఈజ్ ప్రైమ్ కార్యక్రమం ద్వారా ఇతర ప్రయాణీకులకు కూడా కొన్ని ప్రత్యేక సౌకర్యాలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఎయిర్ పోర్ట్ సీఈవో ఎస్‌జీకే కిషోర్ తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com