స్వర మాంత్రికుడు 1000వ సినిమా
- October 31, 2015
ఈ తరం సంగీత దర్శకులు 50వ సినిమా చేయటమే చాలా కష్టంగా కనిపిస్తుంది. అలాంటిది ఏకంగా 1000 సినిమాలకు సంగీతం అందించటం అంటే మామూలు విషయం కాదు. అలాంటి అరుదైన రికార్డ్ ను త్వరలోనే సొంతం చేసుకోబోతున్నారు, సౌత్ సినిమా మ్యూజిక్ లెజెండ్ ఇళయరాజా. తన స్వర ప్రస్థానంలో ఎన్నో అద్భుతమైన పాటలతో అలరించిన ఈ స్వర మాంత్రికుడు సంగీతం అందించిన 1000వ సినిమా త్వరలోనే రిలీజ్ కు రెడీ అవుతోంది. ఇళయరాజ కెరీర్ లో మైల్ స్టోన్ లాంటి సినిమా కావటంతో ఈ సినిమాను భారీగా ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్. ఇంకా పేరు నిర్ణయించని ఈ సినిమాలో సుబ్రమణ్యపురం సినిమాతో దర్శకుడిగా పరిచయం అయి తరువాత హీరోగా మారిన శశికుమార్ హీరోగా నటిస్తున్నాడు. శరత్ కుమార్ కూతురు వరలక్ష్మీ హీరోయిన్ గా నటిస్తోంది. తమిళ్ తో పాటు తెలుగులో కూడా రిలీజ్ కానున్న ఈ సినిమా ఆడియో రిలీజ్ ను ప్రతి ష్టాత్మకంగా నిర్వహించాలన్న ఉద్దేశంతో భారీ ఈవెంట్ ను ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







