రొయ్యల మెంతికూర

- November 01, 2015 , by Maagulf
రొయ్యల మెంతికూర

కావలసిన పదార్థాలు: రొయ్యలు - పావు కిలో, నూనె - 1 టేబుల్‌ స్పూను, ఉల్లి తరుగు - 1 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు - 1 టీ స్పూను, పసుపు - అర టీ స్పూను, కారం - 1 టీ స్పూను, కసూరి మేతీ - 1 టేబుల్‌ స్పూను, కొత్తిమీర తరుగు - పావు కప్పు, ఉప్పు - రుచికి తగినంత, నీరు - అరకప్పు.
తయారుచేసే విధానం: రొయ్యలను శుభ్రం చేసి పక్కనుంచాలి. నూనెలో ఉల్లి తరుగు, అల్లం వెల్లుల్లి పేస్టు ఒకటి తర్వాత వేగించాలి. ఇప్పుడు రొయ్యలు వేసి 3 నిమిషాల తర్వాత కారం, పసుపు, ఉప్పు కలిపి మూత పెట్టి మరో రెండు నిమిషాలు మగ్గించాలి. తర్వాత నీరుపోసి చిన్నమంటపై ఉడికించాలి. నీరు ఆవిరయ్యాక మెదిపిన కసూరి మేతీ వేసి మరో 5 నిమిషాలు ఉంచాలి. దించేముందు కొత్తిమీర తరుగు చల్లాలి. ఈ కూర అన్నంలోకి చాలా రుచిగా ఉంటుంది
.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com