ఈ మలయాళీ సూపర్ స్టార్‌కి బ్రహ్మణుడిగా పుట్టాలని ఉందట..
- September 26, 2017
తెలంగాణలో ఆర్యవైశ్యులు, బలహీనవర్గాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతునే ఉంది. ఒకరు మా కులం గొప్పది అంటే మరొకరు మా కులం గొప్పది అంటూ తీవ్రస్థాయిలో వాగ్వివాదాలకు దిగుతున్నారు. ఈ నేపథ్యంలో కేరళ సూపర్ స్టార్ , బీజేపీ ఎంపీ సురేశ్ గోపీ నేనే వచ్చే జన్మలో బ్రాహ్మణుడిగా పుట్టాలనుకుంటున్నాను అని సంచలన వ్యాఖ్యలు చేశాడు.
తిరువనంతపురంలో బ్రాహ్మణులు నిర్వహిస్తున్న 'యోగక్షేమ' సభకు సురేశ్ గోపీ స్పెషల్ గెస్టుగా వచ్చారు. అక్కడ ఆయన ప్రసంగంలో... 'పునర్జన్మ పై నాకు నమ్మకం ఉంది. వచ్చే జన్మలో జంధ్యం ధరించే కులంలో పుడతా. బ్రహ్మణుడిగా పుట్టి శబరిమల ఆలయ ప్రధాన పూజారిగా బాధ్యతలు స్వీకరించాలని ఉందని తెలిపాడు. ఫలితంగా శబరిమల అయ్యప్పని తాకవచ్చు...స్నానం చేయించొచ్చు అని తన మనసులోని కోరికను బయటపెట్టాడు. అలాగే జంధ్యం ధరించిన వారినందరినీ దేవుళ్లుగా పరిగణించాలని సూచించాడు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







