భాగ్యనగరాన్ని ముంచెత్తిన భారీ వర్షం..
- September 26, 2017
హైదరాబాద్‌లో ఉదయాన్నే వాతావరణం చల్లగా మారిపోయింది. చాలా ప్రాంతాల్లో భారీవర్షం కురిసింది. కూకట్‌పల్లి నుంచి మొదలు జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఖైరతాబాద్, సికింద్రాబాద్, దిల్ సుఖ్‌నగర్, ఇలా అన్ని ప్రాంతాల్లోనూ, ఓల్డ్‌సీటీలో కొన్ని ఏరియాల్లోనూ కొద్దిసేపు కుంభవృష్ణి కురిసింది. అరగంటపాటు ఏకదాటిగా కురిసిన వానకు రోడ్లపై నీరు చేరింది. ఉదయాన్నే అంతా ఆఫీస్‌లకు వెళ్లే సమయం కావడంతో వాహనదారులంతా ఇబ్బందులు పడ్డారు.
అల్పపీడన ప్రభావంతో మరో 24 గంటలు కోస్తా జిల్లాలతోపాటు, తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో జల్లులు పడనున్నాయి. ఖమ్మం, నల్గొండ, హైదరాబాద్,మహబూబ్‌నగర్‌లో వర్షాలతో కాస్త జలకళ కనిపిస్తోంది. వారంలో మరో అల్పపీడనం కూడా ఏర్పడుతోందని దాని ప్రభావంతో వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు.
సడన్ వర్షం కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులకు ఇక్కట్లు ఎదురయ్యాయి. సికింద్రాబాద్ నుంచి హైటెక్ సిటీ వరకు దాదాపు రోడ్ల పక్కనే నిలబడిపోయారు ఉద్యోగులు. మెట్రో రైలు మార్గం కింద కొంతసేపు నిలబడ్డారు. వర్షం పడినంత సేపు అక్కడ ఉన్న ఉద్యోగులు.. వాన తగ్గాక ఆఫీసులకు బయలుదేరారు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







