ఇండియన్ ఉమెన్ క్రికెటర్ మిథాలీ పై ఓ ఫిల్మ్
- September 27, 2017
ఇండియన్ ఉమెన్ క్రికెటర్ మిథాలీ రాజ్ సక్సెస్ ఒకరోజు కష్టపడితే వచ్చింది కాదు. ఆమె క్రికెట్‌లో కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు అమ్మాయిలు కేవలం ఇండోర్ గేమ్స్ కే పరిమితి అయ్యేవారు. ఔట్ డోర్ గేమ్స్ అంటే కోకో..కబడ్డీ, టెన్నికాయిట్ లాంటి ఆటలు బాగా ఆడేవారు. ఇదే మిథాలీని పున: ఆలోచనలో పడేసింది. ఎందుకు అమ్మాయిలు క్రికెట్ ను కెరీర్‌గా ఎంచుకోవడం లేదు.....నాకు క్రికెట్ అంటే ఇష్టం సో నేనే క్రికెట్ ఆడతాను అని అంటూ వేసిన అడుగు...ఇప్పటి వరకు కొనసాగుతోంది. మిథాలీ 14 ఏళ్ల వయస్సులోనే 1997 ఉమెన్ క్రికెట్ వరల్డ్ కప్‌లో ఫస్ట్ టైం ఆడి అందరి మన్ననలను పొందింది. మిథాలీని అందరూ ఇండియన్ లేడీ టెండూల్కర్ అని పిలిచేవారు. క్రికెట్‌నే కెరీర్‌గా ఎంచుకొని ఎన్నో అవార్డులు , రివార్డులను సొంతం చేసుకుంది. ఇప్పుడు ఆమె జీవిత చరిత్ర ఆధారంగా ఓ సినిమా తెరకెక్కనుంది.
ప్రముఖ నిర్మాణ సంస్థ వయాకామ్ 18 మోషన్ పిక్చర్స్ వారు మిథాలీ రాజ్ బయోపిక్‌కు శ్రీకారం చుట్టారు. మిథాలీ రాజ్ కూడా దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. అమ్మాయిలు స్పోర్ట్స్ వైపు రావడానికి ఈ సినిమా ఇన్‌స్పిరేషన్‌గా ఉండాలని భావిస్తున్నట్టు తెలిపింది.
తాజా వార్తలు
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!
- దుబాయ్‌లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్







