పాక్ చిన్నారికి కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మా సాయం
- September 27, 2017
సుష్మాస్వరాజ్.. యావత్ భారతీయులకు పరిచయం అక్కర్లేని పేరు. కేంద్ర విదేశాంగ శాఖ మంత్రిగా తన బాధ్యతలు సమర్థంగా నిర్వహిస్తూనే ఎన్నోసార్లు మానవత్వాన్ని చాటుకున్నారు. ఆపదలో ఉన్నామంటూ ఒక్క ట్వీట్ చేస్తే చాలు ప్రపంచంలో ఏ మూలన భారతీయలు ఉన్నా క్షణాల్లో ఆమె నుంచి సాయం అందుతుంది. అందుకు 'ఉజ్మా' ఘటన వంటి ఉదాహరణలు ఎన్నో.. కేవలం స్వదేశీయులే కాదు.. సాయం కోరి వచ్చిన విదేశీయులకు సైతం ఆపన్న హస్తం అందిస్తుంటారు. అందుకు నిదర్శనమే ఈ ఘటన.
తమ ఏడేళ్ల చిన్నారికి భారత్‌లో ఓపెన్‌హార్ట్ సర్జరీ చేయించేందుకు పాకిస్థాన్‌కు చెందిన ఓ మహిళ గత ఆగస్టులో వీసాకు దరఖాస్తు చేసుకుంది. అయితే ఇప్పటి వరకూ వీసా జారీ చేయకపోవడంతో ఆమె సుష్వాస్వరాజ్ సాయం కోరింది. తమ చిన్నారికి వీసా మంజూరు చేయాలంటూ ట్వీట్ చేసింది. ఈ ట్వీట్‌కు స్పందించిన సుష్మాస్వరాజ్.. ఆ చిన్నారి మెడికల్ వీసాకు అనుమతినిస్తున్నట్లు ట్విటర్ ద్వారా వెల్లడించారు.
ఆ చిన్నారి త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు సుష్మ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. గతంలోనూ ఆమె ఇదే విధంగా కొందరు పాక్ చిన్నారులు, మహిళలకు మెడికల్ వీసాలు అందించిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!
- దుబాయ్‌లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్‌పోర్ట్‌కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం







