విక్రమ్ '10' సినిమా ఫస్ట్ లుక్
- September 27, 2017
శివపుత్రుడు, అపరిచితుడు చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న సెన్సేషనల్ స్టార్ చియాన్ విక్రమ్ హీరోగా బ్యూటీఫుల్ సమంత హీరోయిన్గా రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ 10 ఎన్నత్తు కుల్ల. విజయ్ మిల్టన్ దర్శకుడు. ఎ.ఆర్.మురుగదాస్ నిర్మించిన ఈ చిత్రం తమిళంలో మంచి విజయం సాధించింది.
ఈ చిత్రాన్ని తెలుగులో '10' పేరుతో విడుదల చేస్తున్నారు. ఫాక్స్‌స్టార్, ఎ.ఆర్.మురుగదాస్ సమర్పణలో శ్రీ సుబ్రమణ్యేశ్వర సినీ క్రియేషన్స్ బ్యానర్‌పై జి.సుబ్రమణ్యం, ఎం.సుబ్బారెడ్డి, రామారావ్ చింతపల్లి ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేయబోతున్నారు.
ఈ సినిమా తెలుగు వెర్షన్ ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ తో సినిమా ప్రమోషన్స్ ప్రారంభం అయ్యాయి. డబ్బింగ్ కార్యక్రమాలు పూర్తి చేసి సినిమాను అక్టోబర్‌లో విడుదల చేయడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.
చియాన్ విక్రమ్, సమంత, ఛార్మి, పశుపతి, రాహుల్ దేవ్, అభిమన్యు సింగ్, సునీల్ తాపా తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతంః డి.ఇమాన్, సినిమాటోగ్రాఫర్ః భాస్కరన్ కె.ఎం, నిర్మాతలుః జి.సుబ్రమణ్యం, ఎం.సుబ్బారెడ్డి, రామారావ్ చింతపల్లి, దర్శకత్వంః విజయ్ మిల్టన్.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







