విమానం నడుపుతుండగా పైలట్ మృతి, కువైట్ లో అత్యవసర ల్యాండింగ్
- September 27, 2017
అబుదాబి : నిర్దేశించబడిన గమ్యం వైపునకు గాలిని చీల్చుకొంటూ దూసుకువెళుతున్న ఓ విమానం అకస్మాత్తుగా వెనక్కి తిరిగింది. అందులో ప్రయాణిస్తున్న విమాన ప్రయాణికులకు జరిగిందేమిటో అర్ధం కాలేదు. ఆ తర్వాత వారికి ఓ ప్రకటన వెలువడింది. విమాన కేబిన్ లో విమానం నడుపుతున్నఇరువురు పైలట్ లలో ఒకరు అకస్మాతుగా చనిపోవడంతో విమానం వెనుతిరిగి కువైట్ లో అత్యవసర పరిస్థితులలో కిందకు దించుతున్నట్లు విమాన సిబ్బంది తెలిపారు.. అబుదాబి నుంచి ఆంస్టర్ డామ్ కు వెళుతున్న ఇతిహాద్ ఎయిర్వేస్ విమానంను నడుపుతూ ఓ పైలట్ విషాదంగా మృతి చెందారు. అబుదాబి ఆధారిత విమానవాహక విమానంను వెనక్కితిప్పి కువైట్ కు సురక్షితంగా మళ్లించబడింది, కానీ అందులోని పైలట్ చనిపోయినట్లు బుధవారం ఒక ప్రకటనలో విమాన అధికారులు ప్రకటించారు. అబుదాబి నుంచి ఆంస్టర్ డామ్ కు ప్రయాణికులు, సరుకు రవాణా సేవ నిమిత్తం వెళుతున్న ఎతిహాద్ ఎయిర్వేస్ ఇ వై 927 విమానంలోని ఇరువురు పైలట్లలో ఒక పైలట్ మరణం గురించి అబుదాబి నుంచి ఆంస్టర్ డామ్ కు నివేదించడానికి విచారం వ్యక్తం చేసింది. కెప్టెన్ విమానాన్ని నడపడం ప్రారంభించిన తరువాత, మొదటి అధికారి ఒక అత్యవసర కాల్ చేసి, తన సహచర పైలట్ చనిపోయాడని సురక్షితంగా కువైట్ కు విమానంను మళ్లిస్తున్నట్లు ఎతిహాద్ ఒక ప్రకటనలో తెలిపారు," విమానంలో పైలట్ ఆకస్మికంగా మరణించడాన్ని జీర్ణించుకోలేకపోతున్నామని ఆ నష్టాన్ని మేము భర్తీ చేసుకోలేమని ఆ సహోదరుడి కుటుంబంకు ఈ సమయంలో, మేము మా హృదయపూర్వక సంతాపాన్ని తెలియచేస్తున్నట్లు ఎతిహాడ్ ఎయిర్వేస్ తెలిపింది.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







