పూరి దర్శకత్వం లో చెర్రీ.!
- September 27, 2017
రామ్ చరణ్ హీరోగా తెలుగు తెరకు పరిచయమై రేపటికి పదేళ్లు. ఆయన చిరుత సినిమా ద్వారా తెరంగేట్రం చేశారు. పూరి జగన్నాథ్ డైరెక్షన్లో సి.అశ్వనీదత్ నిర్మాణ సారధ్యంలో చిరుత మూవీ వచ్చింది. అప్పుడు మొదలు ఇప్పటి వరకూ ఈ కాంబినేషన్ రిపీట్ అవలేదు. అయితే తాజాగా మళ్లీ ఈ ముగ్గురి కాంబినేషన్లో ఓ మూవీ రాబోతోందని టాక్. పూరి రీసెంట్గా చెర్రీకి ఓ కథను కూడా వినిపించేశారట. చెర్రీ కూడా ఓకే చెప్పేసినట్టు సమాచారం. దీంతో ఈ చిరుత కాంబినేషన్ మళ్లీ రిపీట్ అవుతుందనే వార్త ఫిలింనగర్లో షికారు చేస్తోంది. ప్రస్తుతం చెర్రీ రంగస్థలం 1985 మూవీలో నటిస్తున్నారు. అనంతరం కొరటాల శివతో మరో మూవీ తెరకెక్కనుందట. అది అయిన వెంటనే పూరితో సినిమా ప్రారంభమవుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







