ఉగ్రవాద నిధిని సేకరించినా..ప్రోత్సాహించినా కఠిన జైలుశిక్ష ,తీవ్రమైన జరిమానాలు
- September 28, 2017
మనామా: బహ్రెయిన్ లో తీవ్రవాదంపై ఉక్కుపాదం మోపనున్నారు. దేశంలో లేదా వెలుపల తీవ్రవాద కార్యకలాపాలలో పాల్గొనేవారికి " 10 సంవత్సరాల తక్కువ కాకుండా " జైలుశిక్ష, భారీ జరిమానాలు నిర్దేశిస్తూ ఒక డిక్రీని గురువారం కింగ్ హేమాడ్ బిన్ ఇసా అల్ ఖలీఫా జారీ చేశారు. డిక్రీ-లా 36/2017 ప్రకారం తీవ్రవాద నివారణ మరియు తీవ్రవాదం కోసం పెద్ద ఎత్త్తున నిధులను సమీకరించడం మరియు డబ్బులను పెట్టుబడిగా పెట్టడం నిషేధంపై డిక్రీ-చట్టం 4/2001 యొక్క ఆర్టికల్ 3 చట్టం సవరించారు. దీని ప్రకారం తీవ్రవాద కార్యకలాపాలలో పాల్గొన్నవారికి "జీవిత ఖైదు లేదా 10 సంవత్సరాల కంటే తక్కువ కాకుండా జైలు శిక్ష మరియు 100,000 బహ్రెయిన్ దినార్ల కంటే తక్కువ కాకుండా జరిమానాలు విధించనున్నారు. అంతతేకాక తీవ్రవాదంను కొనసాగించేవారిపై 500,000 బహ్రెయిన్ దినార్ల కంటే ఎక్కువ మొత్తంలో జరిమానాను విధించాలని ఆ డిక్రీలో పేర్కొన్నారు. దేశంలో లేదా వెలుపల తీవ్రవాద కార్యక్రమంలో నిమగ్నమయ్యే సంఘం, సమూహం, సంస్థ, లేదా తీవ్రవాద ముఠాకి సంబంధించిన ఆస్తులు, నిధులు లేదా వారి ఆదాయం పెంచడం, నిధులు ఇవ్వడం లేదా దాతగా సహాయం చేసే ఇచ్చే ప్రతి ఒక్కరిపై జరిమానా విధించనున్నారు. తీవ్రవాదం కోసం వారి ప్రయోజనం కోసం ఏదైనా కార్యకలాపాన్ని చేపట్టేవారు లేదా ఏ విధంగానైనా తీవ్రవాదులకు మద్దతు పలికేవారు లేదా తీవ్రవాదులకు ఆర్థిక సహాయం అందించేవారు మరియు తీవ్రవాద కార్యకలాపంలో పాల్గొంటున్నవారు శిక్షలకు ఏ విధంగా అర్హులో శాసనం ఆర్టికల్ 3 పేరా (3-1) లో వివరంగా పొందుపర్చారు. దేశంలో లేదా వెలుపల తీవ్రవాద కార్యకలాపంలో పాల్గొనే వ్యక్తుల సమూహం లేదా ఆస్తి, నిధుల లేదా వారి ఆదాయాన్ని సేకరించడం, కేటాయించడం లేదా కేటాయించే వ్యక్తిపై అదేవిధంగా జరిమానా విధించబడిందని చెపుతుంది. తీవ్రవాదంను "అదే పద్ధతుల్లో" ప్రత్యక్షంగా లేదా మధ్యవర్తిత్వం ద్వారా ఏ విధమైన కార్యకలాపాలకు పాల్పడినా లేదా వాటి యొక్క ప్రయోజనం కోసం దోపిడీ చేయడానికి ఈ సంస్థల నుండి ఎలాంటి నిధులు తీసుకొన్న ప్రయత్నం కూడా" నేరం."పైన పేర్కొన్న నేరాలకు పాల్పడినప్పుడు కఠిన శిక్షలు తప్పవని హెచ్చరించారు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







