రియల్ లైఫ్ లోనూ ప్రభాస్ హీరోయే
- September 29, 2017
కేంద్రం ప్రభుత్వం తలపెట్టిన 'స్వచ్ఛతా హీ సేవా' కార్యక్రమంలో భాగస్వాములు కావాలని ప్రధాని మోదీ దేశంలోని పలువురు ప్రముఖులకు పిలుపునిచ్చిన సంగతి తెల్సిందే. ఇందులో బాగంగా టాలీవుడ్ కు సంబధించి.. రాజమౌళి, మోహన్‌బాబు, ప్రభాస్, మహేశ్‌బాబు తదితరులకు నరేంద్రమోదీ లేఖలు రాశారు.
ఈ లేఖపై తాజాగా ప్రభాస్ స్పదించాడు. " డియర్ ఆల్. పరిశుభ్రతకు ఎంతో విలువిచ్చిన మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో నేనూ భాగస్వామ్యం కావాలని అనుకుంటున్నాను. నా దేశాన్ని శుభ్రంగా, ఆరోగ్యంగా ఉంచడం ఓ పౌరుడిగా అది నా బాధ్యతే కాదు అలవాటు కూడా. నాలాగే మీరూ ఆలోచించి భారతదేశం శుభ్రంగా ఉండేలా మీ వంతు కృషిచేయాలని ఆశిస్తున్నాను. ఇప్పుడున్న దానికంటే మన దేశం మరింత అందంగా తయారవుతుంది. జై హింద్" అని సోషల్ మీడియా వేదికగా కోరాడు ప్రభాస్.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







