కువైట్ అవెన్యూలో ఒక దారి తాత్కాలికంగా మూసివేత
- September 29, 2017
మనామా: ఉమ్ ఆళ్హస్సం జంక్షన్ సమీపంలో కువైట్ అవెన్యూలో విద్యుత్ కేబుల్స్ ను ఏర్పాటుచేసే పని తప్పనిసరి కాబడిందని ప్రజలకు ప్రకటించారు. దీంతో ఉత్తర దిక్కున ఉన్న ఎడమ దారిని మూసివేసి మనామాకు దారితీసే ట్రాఫిక్ ను వేరే ఒక దారి వైపునకు మళ్ళించబడుతుందని వర్క్స్, మునిసిపాలిటీ వ్యవహారాల మరియు అర్బన్ ప్లానింగ్ పథక అంతర్గత మంత్రిత్వశాఖ తెలిపింది. ఈ మల్లింపును ట్రాఫిక్ జనరల్ డైరెక్టరేట్ తో సహకారంతో అమలుచేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ దారి మూసివేత 29 వ తేదీ శుక్రవారం రాత్రి 11:00 గంటల నుండి అక్టోబర్ 2 వ తేదీ సోమవారం ఉదయం 5 గంటల వరకు అమలులో ఉంటుంది. ఈ రహదారిని ఉపయోగించుకొనేవారందరు పైన పేర్కొన్న విషయాలను పరిగణన లోనికి తీసుకోవాలని కోరారు. అలాగే వాహనదారుల భద్రత కోసం ట్రాఫిక్ నియమాలను గమనించి వాటిని పాటించాలని తద్వారా సురక్షిత ప్రయాణం ఈ మార్గంలో కొనసాగించాలని అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- హైదరాబాద్: పారిశ్రామిక భూముల బదలాయింపును అడ్డుకునేందుకు కేటీఆర్ పర్యటన
- మచిలీపట్నం రహదారి అభివృద్ధి ప్రాజెక్టుల పై బాలశౌరి–NHAI చైర్మన్ తో భేటీ
- కామినేని విజయ ప్రస్థానంలో మరో కీలక మైలురాయి
- రూపాయి కుప్పకూలింది..
- దక్షిణ సుర్రాలో సందర్శకులకు పార్కింగ్ ఏర్పాట్లు..!!
- ధోఫర్‌లో ఐదుగురు యెమెన్ జాతీయులు అరెస్టు..!!
- సరికొత్త కారును గెలుచుకున్న ప్రవాస కార్పెంటర్..!!
- బహ్రెయిన్‌లో ఆసియా మహిళ పై విచారణ ప్రారంభం..!!
- ప్రైవేట్ రంగంలో.5 మిలియన్ల సౌదీలు..!!
- ఖతార్ లో 2025 చివరి సూపర్‌మూన్..!!







