స్వీయవిశ్వం:-

- September 29, 2017 , by Maagulf

సాంద్రతిమిరకుహరం
మృణ్మయవల్మీకం
కుడ్యకోణం
తరుమూలం
సర్పసరటపిపీలికాది సరీసృపాల
సువిశాలవిశ్వం;
నీరదావలయుతగగనం
హర్మ్యశిఖరం 
ద్రుమోపరిపల్లవం
శాఖోపరినీడం
శుకకాకచటకాది పక్షిసమూహాల
సువిశాలవిశ్వం;
సరోవరస్రోతస్వినీమహార్ణవసలిలం
గభీరాంతస్సాగరవసిత శిలాసర్వస్వం
తీరోపరిసైకతం 
సైకతోపరిప్రకాశం 
మత్స్యకూర్మమకరతిమింగలాది జలచరాల
సువిశాలవిశ్వం;
నిత్యయామినీసదృశమహాంతరిక్షం 
సూర్యచంద్రతారాగ్రహమండలం 
సప్తఖండ పంచమహాసముద్ర పర్యంతం 
సమస్తజీవసామ్రాజ్యాధిపత్యం 
నానాదేశప్రదేశ మానవసమూహాల
సువిశాలవిశ్వం;
నా కన్నెంత?
నా చూపెంత?
నీటికి వెలుపల విశ్వమెంతుందో 
చేపకేం తెలుసు?
అంతరిక్షం అవతల విశ్వమెంతుందో
మనిషికేం తెలుసు?
విశ్వం ఒకటి కాదు!
కోట్లాది విశ్వాలు!
ఒక్కో జీవిది ఒక్కో విశ్వం
-సిరాశ్రీ

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com