గోపీచంద్ కు 'ఆక్సిజన్' సినిమా తో హిట్ కొడతాడా
- October 01, 2017
గోపీచంద్ అనగానే యాక్షన్ హీరో అన్న గుర్తింపు.. ఐతే అతను ఈ మధ్యలో ఒక్కడున్నాడు, సాహసం లాంటి ప్రయోగాత్మక సినిమాలు.. లౌక్యం-సౌఖ్యం లాంటి ఎంటర్టైనర్లు చేశాడు. కొన్ని నెలల కిందట వచ్చిన ‘గౌతమ్ నంద’ కూడా పూర్తి స్థాయి యాక్షన్ సినిమా ఏమీ కాదు. ఐతే ఇప్పుడు గోపీ తన పూర్వపు అవతారంలోకి వెళ్లాడు. పూర్తి స్థాయి యాక్షన్ సినిమాతో రెడీ అయ్యాడు. ఆ సినిమానే.. ఆక్సిజన్.
ప్రొడక్షన్ బాగా ఆలస్యమై.. సెట్స్ మీదికి వెళ్లిన రెండేళ్లకు ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. విజయదశమి కానుకగా ‘ఆక్సిజన్’ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ చూస్తే ఇది పూర్తి స్థాయి యాక్షన్ మూవీ అని అర్థమవుతుంది. మంచి ఫ్యామిలీ.. అందమైన ప్రేయసి.. ఎప్పుడూ వెన్నంటి ఉండే స్నేహితులు.. ఇలా అంతా సాఫీగా సాగిపోతున్న హీరో కుటుంబంలో ఒక విషాదం జరుగుతుంది. తన ఆప్తుల్ని కోల్పోతాడు హీరో. తనలా ఇంకెవ్వరికీ కాకూడదన్న ఉద్దేశం తో మిషన్ మొదలుపెడతాడు. విలన్ల పని పడతాడు. ఇదీ ఈ సినిమా కధాంశం... ఈ ట్రైలర్ చూస్తే గోపీచంద్ నుంచి ఆశించే యాక్షన్ అంశాలకైతే ఢోకా లేదనిపిస్తోంది. ‘ఆక్సిజన్’ అన్న టైటిల్ డిఫరెంటే కానీ.. సినిమా మాత్రం రెగ్యులర్ కమర్షియల్ స్టయిల్లోనే సాగేలా ఉంది. సీనియర్ ప్రొడ్యూసర్ ఎ.ఎం.రత్నం తన కొడుకు జ్యోతికృష్ణ దర్శకత్వంలో చేస్తున్న సినిమా ఇది. ఈ చిత్రానికి ఆయన స్క్రీన్ ప్లే కూడా అందించడం విశేషం. అక్టోబరు 27న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







