మస్కట్ లో ప్రవాసుల పూల పండుగ

- October 01, 2017 , by Maagulf

మస్కట్: ఒమాన్ తెలంగాణ సమితి (ఒమాన్ లోని ఇండియన్ సోషల్ క్లబ్, తెలంగాణ వింగ్) ఆధ్వర్యంలో మస్కట్ లో శుక్రవారం రాత్రి ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు వైభవంగా జరిగాయి. జన్మభూమికి దూరంగా అన్యభూమి ఓమాన్ లో ఉన్న రెండువేలకు పైగా తెలంగాణ ప్రవాసీలు మస్కట్ లోని వాది కబీర్ లో గల మస్కట్ క్లబ్ లో ప్రవాసి బతుకమ్మ సంబరాలు సాంప్రదాయబద్దంగా ఘనముగా నిర్వహించారు. ఇండియా నుంచి వచ్చిన ప్రముఖ గాయకులు రాంపూర్ సాయి, తేలు విజయ లు తమ పాటలతో మస్కట్ లోని ప్రవాసులను అలరించారు. 

ఇండియా నుండి తంగేడు తదితర పూలను తెప్పించుకుని పేర్చిన బతుకమ్మలు పూల జాతరను తలపించాయి. పరాయి దేశానికి వచ్చిన తామందరం ఒకే దగ్గర చేరి బతుకమ్మ వేడుకలను జరుపుకోవడం ఆనందంగా ఉందని, తమకు స్వదేశంలో ఉన్నఅనుభూతి కలిగిందని ఖానాపూర్ కు చెందిన ప్రముఖ భారతీయుడు, ఒమాన్ తెలంగాణ సమితి అధ్యక్షుడు గుండేటి గణేష్ తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com