సినీ నటుడు మోహన్‌బాబుకు గౌరవ డాక్టరేట్
- October 01, 2017
తెలుగు సీనియర్ నటుడు, డైలాగ్ కింగ్ మోహన్ బాబుకు మరో అరుదైన గౌరవం లభించనుంది. చెన్నైలోని ఎంజీఆర్ విశ్వవిద్యాలయం ఆయనకు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేయనుంది. ఈ విషయాన్ని ప్రముఖ హీరో, మోహన్ బాబు తనయుడు మంచు మనోజ్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించాడు.
ఈ గౌరవ డాక్టరేట్‌ను ఈనెల 4వ తేదీన అందుకోనున్నాడు. దీనిపై ఆయన చేసిన ట్వీట్‌లో... ‘కంగ్రాట్స్ నాన్నా.. ఎంతో గర్వపడే క్షణం’ అని సంతోషం వ్యక్తం చేశాడు. ఈ సందర్భంగా మోహన్ బాబు ఫొటోను పోస్ట్ చేశాడు.
కాగా, సినీ నటుడిగా, నిర్మాతగా, రాజకీయవేత్తగా మోహన్ బాబు తనదైన ముద్ర వేశారు. సుమారు 560 చిత్రాల్లో నటించిన ఆయన, టీడీపీ తరపున గతంలో రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. 2007లో ‘పద్మశ్రీ’ పురస్కారంతో మోహన్ బాబును భారత ప్రభుత్వం గౌరవించిన విషయం తెల్సిందే.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్‌లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







