యాంకర్ చిత్రలేఖ రచించిన `వన్నెపూల విన్నపాలు` పుస్తక ఆవిష్కరణ
- October 05, 2017
క్లాస్ మెట్స్', 'శంభో శివ శంభో', 'పరుగు', 'దమ్ము', లయన్', 'దళం' తదితర చిత్రాల్లో కీలక పాత్రల ద్వారా సిల్వర్ స్ర్కీన్ పై మెరిసిన రాణీ చిత్రలేఖ సుపరిచితురాలే. వెండితెరపైనే కాదు.. బుల్లితెరపై యాంకర్ గా కూడా రాణిస్తున్నారు. 'జస్ట్ ఫర్ ఫన్' అని 'మా' టీవీలో సందడి చేసినా, 'యాహూ' అని ఈటీవీలో అల్లరి చేసినా, 'స్వరనీరాజనం' అని తీయని స్వరంతో 'జీ తెలుగు'లో మాట్లాడినా, 'ఆట' డ్యాన్స్ షో ద్వారా అలరించినా... ఏ ప్రోగ్రామ్ కైనా, ఏ ఛానల్ కైనా యాంకర్ చిత్రలేఖ న్యాయం చేస్తారు. డ్యాన్స్ షో, టాక్ షో, మ్యూజిక్ షో ఏదైనా ఓకే. అందుకే యాంకర్ గా రాణీ చిత్రలేఖ బోలెడంత పాపులార్టీ తెచ్చుకున్నారు. ఇక, బుల్లితెర నటిగా 'రాధా మధు', 'నాన్న', 'మానసవీణ', 'సీతారామపురం' వంటి సీరియల్స్ ద్వారా నటిగా తానేంటో నిరూపించుకున్నారు.
యాంకర్‌గా, నటిగా మాత్రమే కాదు.. 'వన్నెపూల విన్నపాలు'తో తనలో మంచి రచయిత్రి కూడా ఉందని నిరూపించుకోవడానికి రాణీ చిత్రలేఖ ఓ అడుగు వేసింది. హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో ఆమె రచించిన `వన్నెపూల విన్నపాలు' పుస్తకా విష్కరణ కార్యక్రమం సీనియర్ రచయిత శివారెడ్డితో పాటు పలువురు రచయితల చేతుల మీదుగా జరిగింది.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం







