ఆ మహిళను అదృష్టమలా వరించింది
- October 06, 2017
యూఏఈ రఫాలెలో ఓ మహిళ అనూహ్యంగా బిగ్ 10 మిలియనీర్స్లో ఒకరిగా అవతరించారు. బిగ్ రఫాలె డ్రా సందర్భంగా ఫిలిప్పినో మహిళ ఒకరు 1 మిలియన్ దిర్హామ్‌ని గెల్చుకున్నారు. లీలాని క్యుజోనో డెల్ రొసారియా అనే మమిళ అబుదాబీలో నర్స్‌గా పనిచేస్తున్నారు. ఆమెను అదృష్టం వరించింది. ముగ్గురు పిల్లల తల్లి అయిన ఆమె, భర్త నుంచి విడిపోయారు. 14 ఏళ్ళుగా ఆమె యూఏఈ క్యాపిటల్‌లో ఉంటున్నారు. తన పిల్లలో ఇద్దరు చదువుకుంటుండగా, ఒకరు వర్క్ చేస్తున్నారనీ, తాను గెలుచుకున్న మొత్తంతో తన కుటుంబం హ్యాపీగా జీవనం సాగిస్తుందని చెప్పారామె. తాను సాధించిన మొత్తాన్ని తన కొలీగ్స్‌తోనూ పంచుకోనున్నట్లు లీలాని చెప్పడం గమనించదగ్గ అంశం. టిక్కెట్ కొనుగోలు చేయడంలో వారంతా తనకు సహకరించారని తెలిపారామె. మిగతా తొమ్మిది మంది విజేతల్లో అందరూ పురుషులే, పైగా ఇండియన్స్ ఎక్కువమంది ఉన్నారు.
తాజా వార్తలు
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!
- దుబాయ్‌లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్







