రష్యా పర్యటన చేస్తున్నసౌదీ రాజు

- October 06, 2017 , by Maagulf
రష్యా పర్యటన చేస్తున్నసౌదీ రాజు

సౌదీఅరేబియా: మొట్టమొదటిసారిగా రాజు సల్మాన్ రష్యాలో తన అధికారిక పర్యటన చేస్తున్నారు.  సిరియా విషయంలో సౌదీ, రష్యా మధ్య అసమ్మతి నెలకొన్న నేపథ్యంలో తొలిసారిగా ఇరుదేశాధినేత నేతల మధ్య చర్చలు జరగనున్నాయి. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో సాల్మాన్ సమావేశమవనున్నారు. ఈ సమావేశంలో అతిముఖ్యమైన రక్షణ, శక్తి రంగాల ఒప్పందాలపై చర్చించనున్నారు. ఆయిల్ మార్కెట్‌లో కీలకమైన ఈ రెండు దేశాలు సిరియా యుద్ధ సమయంలో విరుద్ధవైఖరిని ప్రదర్శించాయి. బషర్ అల్ అసాద్‌ను రష్యా సమర్థించగా వ్యతిరేక వర్గానికి సౌదీ మద్ధతు తెలిపింది. దీంతో ఇరుదేశాల సంబంధాల విషయంలో సందిగ్ధత నెలకొంది. 2014 నుంచి ఇరుదేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. దీనితో ఎగుమతులపై అధికంగా ఆధారపడే ఇరుదేశాల మధ్య చర్చలు జరగనున్న నేపథ్యంలో సౌదీ రాజు సల్మాన్.. రష్యా పర్యటన చరిత్రాత్మకం కానుందని నిపుణులు పేర్కొంటున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com