'అదిరింది'కి అరుదైన గౌవరం.!

- October 06, 2017 , by Maagulf
'అదిరింది'కి అరుదైన గౌవరం.!

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న 61వ ప్రతిష్టాత్మక చిత్రం అదిరింది. ఈ చిత్రం టీజర్ కు  1.5 మిలియన్ వ్యూస్ తో తెలుగు స్టార్ హీరోల చిత్రాలకు ధీటుగా వ్యూస్ రావడంతో ఆయన తెలుగు అభిమానులు ఫుల్ ఖుషీ గా వున్నారు. ఈ సినిమాతో తెలుగు లో విజయ్ తన సత్తా చూపించబోతున్నాడు. దాదాపు 100 కోట్లతో నిర్మించిన ఈ చిత్రాన్ని తెలుగు తమిళ భాషల్లో గ్రాండ్ గా రిలీస్ చేయనున్నారు. ఇక తాజాగా ఈ చిత్రానికి అరుదైన గౌరవం లభించింది. ప్రపంచ ప్రఖ్యాత లీ గ్రాండ్ రెక్స్ థియేటర్ లో ఈ చిత్రాన్ని ప్రదర్శించబోతున్నారు. పారీస్ లో ఉన్న ఈ థియేటర్ లో ఇప్పటివరుకు  దకిణ భారతదేశం నుంచి బాహుబలి 2, కబాలి చిత్రాలు మాత్రమే ప్రదర్శింపబడ్డాయి. వాటి తరువాత మళ్లీ విజయ్ అదిరిందికి మాత్రమే ఈ అరుదైన గౌరవం లభించినట్లుగా చిత్ర బృందం తెలిపింది. అలానే పారీస్ తో పాటు యూఎస్ ఏ, లండన్, దుబాయ్, కెనాడా, మలేషియా తదితర దేశాల్లో అదిరింది భారీ స్థాయిలో విడుదల అవుతోంది. అక్టోబర్ 18న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం విడుదల అవుతోంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com