నోట్ల రద్దుపై రెహమాన్ పాట..!
- October 06, 2017
నవంబరు 8, 2016... దేశం గతినే మార్చేసిన రోజది. పెద్దనోట్లు రద్దు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ చేసిన సంచలన ప్రకటనతో దేశం మొత్తం ఉలిక్కిపడింది.పాతనోట్లు మార్చుకునేందుకు గంటల తరబడి బ్యాంకుల వద్ద గడిపినామోదీ తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలు స్వాగతించారు. అయితే ఈ అంశంపై ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ ఓ పాటను రూపొందించారు. పెద్దనోట్ల రద్దు సమయంలో ప్రజల మానసిక ఆలోచనలు, వారి ఆర్థిక ఇబ్బందుల ఆధారంగా 'ది ఫ్లయింగ్ లోటస్' అనే పాటను శుక్రవారం మార్కెట్లో విడుదల చేశారు. ఇది 19 నిమిషాల నిడివి ఉంది. ఈ పాట రాజకీయ పరంగా కాకుండా.. కళాత్మకంగా పాడానని రెహమాన్ వివరించారు. ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయం దేశంలో పెద్ద పరిణామమని, దేశాభివృద్ధికి సంబంధించిన ఈ అంశంపై తాను తన కళ ద్వారా స్పందించాలనుకున్నానని వ్యాఖ్యానించారు.
తాజా వార్తలు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!
- దుబాయ్‌లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్‌పోర్ట్‌కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు







