లాజిస్టిక్స్ హబ్‌గా హైదరాబాద్
- October 06, 2017
దేశంలోనే లాజిస్టిక్ హబ్‌కు కేంద్రంగా హైదరాబాద్ మారనుందని అదేవిధంగా దక్షిణ భారత దేశానికి గేట్ వే గా మారనుందని రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు తెలిపారు. బాటసింగారంలో లాజిస్టిక్ పార్క్‌కు మంత్రి కేటీఆర్ శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి మహేందర్‌రెడ్డి, ఎంపీ బూరనర్సయ్య గౌడ్, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ఏ నగరం అభివృద్ధి చెందాలన్నా మౌలిక వసతులే కీలకమన్నారు. ఈ క్రమంలో భాగంగా హైదరాబాద్ నగరానికి మౌలిక వసతులు కల్పించాల్సిన అవసరం ఉందని తెలిపారు. లాజిస్టిక్ పార్క్ నిర్మాణంతో ట్రాఫిక్ ఇబ్బందులు తగ్గడంతో పాటు స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని చెప్పారు. దేశంలో పెద్ద ఈ-కామర్స్ సంస్థలు తమ వేర్ హౌస్‌లు ఏర్పాటు చేస్తున్నాయన్నారు. హైదరాబాద్ చుట్టూ 12 లాజిస్టిక్ పార్క్‌లు ఏర్పాటు చేయాలనుకుంటున్నట్లు వెల్లడించారు. లాజిస్టిక్ పార్క్‌ల వల్ల 15 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం ఉన్న శీతల గిడ్డంగులు రానున్నాయన్నారు. అదేవిధంగా చర్లపల్లి, నాగులపల్లిలో రైల్వే టెర్మినల్స్ రాబోతున్నట్లు తెలిపారు.
ఓఆర్‌ఆర్ చుట్టూ అభివృద్ధి వేగంగా జరుగుతోందన్నారు. 340 కిలోమీటర్లతో రీజినల్ రింగ్‌రోడ్డు ఏర్పాటుతో పాటు 35 రేడియల్ రోడ్డులు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. రెండు ప్రాంతాల్లో 40 ఎకరాల్లో లాజిస్టిక్ పార్కులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సరుకు రవాణాకు అనువైన ప్రాంతం హైదరాబాద్ అన్నారు.
రైలు, రోడ్డు, విమానయానాన్ని అనుసంధానం చేయాలని.. రైల్వే టెర్మినల్స్ దగ్గర లాజిస్టిక్ పార్కులు దగ్గర ఉండేలా చూడాలని పేర్కొన్నారు. ప్రజల సహకారం లేనిది అభివృద్ధి సాధ్యం కాదు.. ప్రజల సహకారం లేనిది అభివృద్ధి సాధ్యం కాదని మంత్రి కేటీఆర్ అన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజల ఆలోచనలకు అనుగుణంగా పని చేస్తదని తెలిపారు.
టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి భూదందా చేయాల్సిన అవసరం లేదన్నారు. కోకాపేట్‌లో వేలకోట్ల విలువైన భూమి కాపాడినట్లు చెప్పారు. రూ. 16 వందల కోట్లతో మూసీ పరివాహక ప్రాంతాన్ని సుందరీకరిస్తున్నామన్నారు.
ఎకరానికి రూ. 4 వేలు పెట్టుబడి సహకారంగా ఇస్తున్న ఘనత టీఆర్‌ఎస్ ప్రభుత్వానిదన్నారు.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్‌లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







