కాకర పుట్నాల పొడి

- October 08, 2017 , by Maagulf
కాకర పుట్నాల పొడి

కావలసిన పదార్థాలు: కాకరకాయ ముక్కలు - 1 కప్పు, పుట్నాలు - అరకప్పు, జీలకర్ర ఒకటిన్నర టీ స్పూను, ఎండుకొబ్బరి పొడి - 1 టేబుల్‌ స్పూను, కారం - 1 టీ స్పూను, ఉప్పు - రుచికి తగినంత, వెల్లుల్లి రేకలు -4, పసుపు - చిటికెడు, ఆవాలు - పావు టీ స్పూను, కరివేపాకు - 4 రెబ్బలు, నూనె - 2 టేబుల్‌ స్పూన్లు.
తయారుచేసే విధానం: ముక్కలకి ఉప్పు, పసుపు పట్టించి 2 గంటలపాటు ఉంచాలి. పుట్నాలు, ఎండుకొబ్బరి, ఒక టీ స్పూను జీలకర్ర, కారం, (కాస్త)ఉప్పు, వెల్లుల్లి కలిపి పొడికొట్టుకోవాలి. కాకరలోంచి నీటిని సాధ్యమైనంత వరకు పిండేసి నూనెలో దోరగా వేగించి తీసేసి పుట్నాల మిశ్రమంలో కలపాలి. కడాయిలో 2 టీ స్పూన్లు నూనె వేసి ఆవాలు, మిగిలిన జీలకర్ర, కరివేపాకుతో తాలింపు వేసి కాకర మిశ్రమాన్ని జతచేయాలి. అన్నంతో కలుపుకున్నా, పక్కన నంజుకున్నా ఎంతో రుచిగా ఉండే వంటకం ఇది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com