వచ్చే వారం నుండి గవర్నరేట్స్ అంతటా సమగ్ర జాతీయ రవాణా సర్వే నిర్వహణ
- October 08, 2017
మస్కట్ : : వచ్చే వారం నుంచి సుల్తానేట్ యొక్క వివిధ గవర్నరేట్ల పరిధిలో రవాణా విభాగం కోసం సమగ్ర జాతీయ సర్వే ప్రారంభమవుతుంది. ఈ సర్వే అనేది ప్రస్తుతం నిర్మాణ ప్రణాళిక కోసం సుప్రీం కౌన్సిల్చే పని చేస్తున్న జాతీయ నిర్మాణ అభివృద్ధి వ్యూహ సన్నాహాల్లో భాగంగా ఉంది. రవాణా, కమ్యూనికేషన్ల మంత్రిత్వశాఖ మరియు రాయల్ ఒమాన్ పోలీస్ సహకారంతో ఈ కార్యక్రమాన్ని అమలు చేయనున్నారు. రవాణా విభాగానికి జాతీయ సర్వే కార్యక్రమం సుల్తానెట్ మొట్టమొదటిది. ఇది పబ్లిక్ మరియు ప్రైవేట్ రవాణా ట్రాఫిక్ ను అంచనా వేయడమే కాక భవిష్యత్ పోకడలను అంచనా వేస్తుంది. రవాణారంగం కోసం ఒక జాతీయ నమూనాను నిర్మించడానికి వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకోవడానికి దోహదపడే కీలక ప్రణాళిక సాధనాల్లో ఈ సర్వే ఒకటి . ఈ కార్యక్రమంలో గవర్నరేటర్లలో అన్ని ట్రాఫిక్ కదలికలు ఉన్నాయి. ట్రాఫిక్ పోకడలను గుర్తించడానికి వాహన డ్రైవర్ల ద్వారా నింపిన ప్రశ్నావళిని ఇంటర్వ్యూ చేసి, పొందవచ్చు.మరొక సర్వేలో ఇళ్ళ గురించి కూడా జరుగుతాయి. అదనంగా, విమానాశ్రయాలు, పోర్ట్సు మరియు సరిహద్దు చెక్ పాయింట్ల వద్ద ప్రయాణీకులకు కూడా ఒక ప్రశ్నాపత్రం ఇవ్వబడుతుంది. మరో ప్రశ్నాపత్రం ప్రజా రవాణా వినియోగదారులకు కూడా ఇవ్వబడుతుంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







