టాలీవుడ్ సీనియర్ నటుడు హరనాథరావు గుండెపోటుతో మృతి

- October 09, 2017 , by Maagulf
టాలీవుడ్ సీనియర్ నటుడు హరనాథరావు గుండెపోటుతో మృతి

సినీ పరిశ్రమలో వరస మరణాలతో విషాదం నెలకొన్నది.. ప్రముఖ సీనియర్ సినీ నటుడు, రచయిత, నిర్మాత ఎంవీఎస్ హరనాథరావు గుండెపోటుతో ఆయన స్వగృహంలో మృతి చెందారు. ప్రకాశం జిల్లా ఒంగోలు లో 1948 జూలై 27 న ఆయన జన్మించారు. ప్రముఖ దర్శకుడు టి. కృష్ణ సినిమాలకు మాటల రచయితగా పనిచేసి.. మంచి గుర్తింపు పొందారు. 150 పైగా సినిమాలకు రచయితగా పనిచేశారు. సినిమాలతో పాటు నాటకాల్లో కూడా నటించిన హరనాథరావు రాక్షసుడు, స్వయంకృషి వంటి అనేక సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. భారతనారి, ప్రతిఘటన, అన్న, అమ్మాయి కాపురం చిత్రాలకు నంది అవార్డ్ ను అందుకొన్నారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com