చిన్నారికి క్యాన్సర్: తల్లి ఆత్మహత్య
- October 10, 2017బుర్ దుబాయ్‌లోని ఓ హోటల్ భవనంపైనుంచి దూకి మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటనకు సంబంధించి కీలక సమాచారం వెల్లడయ్యింది. ఇది హత్యా? అన్న అనుమానాలు తలెత్తగా, హత్య కాదు ఆత్మహత్య అని పోలీసులు నిర్ధారించారు. తన కుమారుడికి క్యాన్సర్ సోకిందనీ, ఆ వ్యాధి కారణంగా చిన్నారి పడుతున్న వేదనను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్లు మృతురాలు ఆత్మహత్యకు ముందు లేఖ రాసి పెట్టి ఉండడాన్ని పోలీసులు గుర్తించారు. ఆత్మహత్య చేసుకుంటున్న తనను క్షమించాల్సిందిగా భర్తకు రాసిన మరో లేఖనీ పోలీసులు కనుగొన్నారు. ఈ ఘటనకు సంబంధించి మృతురాలి భర్తను పోలీసులు ప్రశ్నించగా, మానసిక సమస్యతో తన భార్య బాధపడుతోందనీ, అయితే ఆమె ప్రాణం తీసుకుంటుందని ఊహించలేకపోయానని చెప్పారు.
తాజా వార్తలు
- ఏపీకి భారీ వర్షాల హెచ్చరిక..
- చిన్నారి మృతదేహాన్ని ఎయిర్‌పోర్ట్‌లో వదిలేసిన సిబ్బంది
- అమీరాతో బిగ్ బాస్ 16 ఫేమ్ అబ్దు రోజిక్ నిశ్చితార్థం
- ఏపీ, తెలంగాణలో ఎన్నికల ప్రచారం ముగింపు..
- ఎన్ఆర్ఐ ఖాతాదారులకు శుభవార్త
- బహ్రెయిన్‌లో నకిలీ యూనివర్సిటీలపై కొరడా..!
- పాలస్తీనియన్ బిడ్‌కు UN జనరల్ అసెంబ్లీ మద్దతు
- యూఏఈలో టాప్ 10 ప్రమాదకర రోడ్లు ఇవే..!
- జపాన్‌లో పర్యటించనున్న సౌదీ యువరాజు
- పార్లమెంటును రద్దు చేసిన కువైట్ ఎమిర్