వాకింగ్ చేశాక కొబ్బరి - పండ్ల రసాలు తాగితే...
- October 11, 2017అన్ని వ్యాయామాల్లోకి నడక ఉత్తమమైన వ్యాయామం. దానివల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి. ప్రతి ఒక్కరూ రోజూ అరగంట నుంచి గంటసేపు నడవాలి. నడిచేటప్పుడు తప్పనిసరిగా బూట్లు వేసుకోవాలి. నడక మొదలు పెట్టే ముందు కనీసం పది, పన్నెండు నిముషాలు వామప్ (శరీరానికి చురుకు పుట్టించే వ్యాయామాలు, కాళ్ళుచేతులను సాగదీయటం) చేయాలి. ఆ తర్వాత వేగంగా నడవాలి.
గంటకు ఆరు కిలోమీటర్ల వేగంతో నడిస్తే మంచి వేగంతో నడిచినట్లు లెక్క. మొదట్లో గంటకు నాలుగు కిలోమీటర్లు నడవగలిగితే చాలు. నడిచేటప్పుడు దూరమూ, సమయం దృష్టిలో ఉంచుకోవటం ముఖ్యం.
ఎత్తయిన ప్రాంతానికి ఎక్కుతున్నట్లు మూడు నిమిషాలు తర్వాత చదును ప్రాంతం మీద రెండు నిమిషాలు మళ్ళీ ఎత్తయిన ప్రాంతం మీద ఇలా మార్చి మార్చి నడిస్తే మంచి ఫలితాలు వస్తాయి. మొదట్లో తక్కువ దూరం వెళ్ళినా తర్వాత వేగం, దూరం పెంచుకుంటూ వెళ్ళాలి. వాకింగ్ చేసేటప్పుడు పండ్లు, కొబ్బరినీళ్ళు త్రాగితే మంచిది.
తాజా వార్తలు
- అద్భుతంగా 'వరల్డ్ తెలుగు కన్సార్టియం' అంతర్జాల సమావేశం
- లండన్లో కత్తిపోట్లు..పలువురికి గాయాలు
- ఈసీ నిషేధం పై స్పందించిన కేసీఆర్..
- ‘వందే భారత్’ మెట్రో ఫస్ట్ లుక్
- రెండేళ్ల పాటు కాలేజీ విద్యార్థులకు ఉచిత ట్రాన్స్ పోర్ట్
- త్వరలో DXB విమానాశ్రయం మూసివేత?
- కొన్ని ప్రాంతాలలో దుమ్ము తుఫాను.. హెచ్చరిక జారీ
- భారీ వర్షాల తర్వాత 30% పెరిగిన ప్రీమియంలు..!
- కువైట్లో విద్యుత్ కోతలపై ఆందోళనలు..!
- పాలస్తీనా రాష్ట్రానికి అంతర్జాతీయ గుర్తింపు..సౌదీ క్యాబినెట్ పిలుపు..!