ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా చైర్మన్‌గా అనుపమ్ ఖేర్
- October 11, 2017
ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్(62)కు కీలక పదవి లభించింది. పుణేలోని ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎఫ్‌టీఐఐ) చైర్మన్‌గా ఖేర్‌ను నియమించినట్లు కేంద్ర సమాచార, ప్రసార శాఖ అధికారులు తెలిపారు. ఎఫ్‌టీఐఐ చైర్మన్‌గా తనను ఎంపిక చేయడంపై ఖేర్ స్పందిస్తూ ‘ప్రతిష్టాత్మకమైన ఎఫ్‌టీఐఐకి చైర్మన్‌గా ఎంపిక కావడాన్ని గౌరవంగా భావిస్తున్నా.
నాకు అప్పగించిన విధుల్ని శక్తివంచన లేకుండా నిర్వర్తిస్తాను’ అని ట్వీటర్‌లో అన్నారు. ఎఫ్‌టీఐఐ చైర్మన్‌గా పనిచేసిన గజేంద్ర చౌహాన్ పదవీకాలం ముగిసిన 7 నెలల అనంతరం కేంద్రం అనుపమ్ ఖేర్‌ను చైర్మన్‌గా కేంద్రం నియమించింది. ఖేర్ ఢిల్లీలోని నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా(ఎన్‌ఎస్‌డీ)లో డిగ్రీ పొందారు. 500 పైచిలుకు చిత్రాల్లో నటించిన ఖేర్ సినిమా,కళల రంగానికి అందించిన సేవలకు గానూ 2004లో పద్మశ్రీ, 2016లో పద్మవిభూషణ్ పురస్కారాలను అందుకున్నారు.
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్‌లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్‌లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







