ఆరేళ్ళ చిన్నారికి పైలట్‌గా ట్రైనింగ్ ఇచ్చిన ఎతిహాద్ ఎయిర్వేస్
- October 13, 2017
ఆరేళ్ళ చిన్నారి అడమ్ మొహమ్మద్ అమెర్కి పైలట్ అవ్వాలనే కోరిక ఉంది. విమానాల్ని నడపడం, ప్రత్యేక పరిస్థితుల్లో పైలట్ ఎలా వ్యవహరిస్తాడు? వంటి అంశాలపై ఆసక్తి ఎక్కువ. యూ ట్యూబ్ ద్వారా దీనికి సంబంధించిన సమాచారాన్ని అడమ్ పొందడమే కాకుండా, పైలట్ అవ్వాలన్న కోరికను సోషల్ మీడియాలో వ్యక్తం చేయడం, దానికి ప్రాచుర్యం లభించడం జరిగాయి. ఫ్లైట్ కెప్టెన్ సమెర్ యక్లెఫ్ ద్వారా ఆ చిన్నారి కోరిక కూడా తీరింది. ఎతిహాద్ ఎయిర్వేస్ వైస్ ప్రెసిడెంట్ ఫ్లైట్ ఆపరేషన్స్ కెప్టన్ మాజెద్ అల్ మజ్రోకి ఆ బాలుడి ఉత్సాహాన్ని చూసి మురిసిపోయారు. ఎతిహాద్ ట్రైనింగ్ సెంటర్‌కి ఆ బాలుడ్ని తీసుకెళ్ళి, ఎయిర్‌బస్ ఎ380 సిమ్యులేటర్ ద్వారా శిక్షణ కూడా ఇప్పించారు. భవిష్యత్తులో ఆడమ్ మంచి పైలట్ అయ్యేందుకు అవకాశాలున్నాయని ఎతిహాద్ ప్రతినిథులు తెలిపారు. ఈ విజయగాధకి సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ లభిస్తోంది.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







