చైనాకు ఎగుమతులను తగ్గించిన ఉ.కొరియా

- October 13, 2017 , by Maagulf
చైనాకు ఎగుమతులను తగ్గించిన ఉ.కొరియా

ఉత్తర కొరియా నుంచి చైనాకు దిగుమతులు వరుసగా ఏడో నెలా తగ్గుముఖం పట్టాయి. ఐక్యరాజ్య సమితి విధించిన ఆంక్షలు ఇందుకు వూతమిచ్చాయి. జగడాలమారి ఉత్తర కొరియా వరుసగా అణు క్షిపణులను పరీక్షిస్తూ అమెరికా సహా మిత్రపక్ష దేశాలను బెదిరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అమెరికా ప్రోద్బలంతో ఆ దేశంతో వాణిజ్యంపై ఐరాస ఆంక్షలు విధించింది. సెప్టెంబర్‌లో ఉత్తర కొరియా నుంచి దిగుమతులు దాదాపు 38 శాతం క్షీణించాయని చైనా కస్టమ్స్‌ అధికార ప్రతినిధి హుయాంగ్‌ సాంగ్‌పింగ్‌ తెలిపారు. ఎగుమతులు 6.7 శాతం తగ్గాయన్నారు. ఐరాస ఆంక్షల నేపథ్యంలో బొగ్గు, ఇనుము, సముద్ర ఆహారం (సీఫుడ్‌) దిగుమతులు తగ్గించుకోగా పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతుల్ని చైనా కత్తిరించింది. ఐతే ప్రపంచ వాణిజ్యంలో డ్రాగన్‌ దేశం గణనీయంగా వృద్ధి సాధించింది. గతేడాదితో పోలిస్తే సెప్టెంబర్‌ ఆఖరుకు అంతర్జాతీయ ఎగుమతులు 8.1 శాతం, దిగుమతులు 18.7 శాతానికి పెరిగాయి. ఆగస్టులో ఇవి 5.5 శాతం, 13.3 శాతం కావడం గమనార్హం. ఇక వాణిజ్య మిగులు 28.5 బిలియన్‌ డాలర్లకు చేరింది. మరోవైపు అమెరికాతో వాణిజ్య బంధాల్లో పురోగతి ఉన్నట్టు తెలుస్తోంది. దశాబ్దంలో రెండు సార్లు మాత్రమే నిర్వహించే కమ్యూనిస్టు పార్టీ కాంగ్రెస్‌ ముందు అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు ఈ గణాంకాలు వూరట కలిగిస్తున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com