దుబాయ్ లో స్నేహితుని ఐ డి కార్డుతో 4 సిమ్ కార్డుల కొనుగోలు : కార్మికునికి జైలుశిక్ష

- October 14, 2017 , by Maagulf
దుబాయ్ లో  స్నేహితుని ఐ డి కార్డుతో 4 సిమ్ కార్డుల కొనుగోలు : కార్మికునికి  జైలుశిక్ష

దుబాయ్ : కొన్ని స్నేహాలు స్వార్ధంతో కొనసాగుతాయి ..మిత్రులమని చెప్పి మరికొందరు మింగుడుపడని సమస్యల ఊబి లోనికి తోసేస్తారు. అదేమాదిరిగా ఓ 36 ఏళ్ల పాకిస్తానీ కార్మికుడు భారతీయ స్నేహితుని ఐ డి కార్డుతో 4 సిమ్ కార్డుల కొనుగోలు చేసిన నేరానికి మూడు నెలలు జైలు శిక్ష విధించారు. అంతేకాక దుబాయ్ కోర్టు దోపిడీ, మోసంలో నేరపూరిత కేసులలో సన్నిహిత సంబంధాలు ఉన్న సంబంధిత నేరస్థుడిని దోషిగా  నిర్ణయించిన తర్వాత,150,000 ధిర్హాంలను నిందితుడు జరిమానా చెల్లించాలని ఆదేశించారు. ఒక టెలిసర్వీస్ ప్రొవైడర్ కు తెలియని ఎలక్ట్రానిక్ పత్రాలు - తన భారతీయ స్నేహితుని యొక్క పేరిట నాలుగు సిమ్ కార్డులను జారీ చేయడానికి నాలుగు మొబైల్ కంపెనీ ఇవ్వాల్సిన వివరాలను తప్పుదారి పట్టించాడు. తప్పుడు వివరాలను సిబ్బంది ద్వారా ఇ-సిస్టంలో నమోదు చేశారు.( నేరస్థుడు  మరొక వ్యక్తి యొక్క ఐ డి నమ్మకద్రోహంగా ఉపయోగించినందుకు ),  తన స్నేహితుడిని మోసం చేసినందుకు 5,000 దిర్హామ్ మరో అదనపు జరిమానా విధించారు  నేర క్లిష్టపరిస్థితి దోషిగా .ఫస్ట్ ఇన్స్టాన్స్ యొక్క కోర్టు అతని జైలు శిక్ష అనుభవించి జరిమానా చెల్లించిన తర్వాత నిందుతుడిని దేశ బహిష్కరణకు ఆదేశించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com