అంతరిక్ష రేడియేషన్‌పై దృష్టి సారిస్తున్న నాసా
- October 14, 2017
వాషింగ్టన్: భూమి నుంచి అంగారకుడికి చేరుకోవడంలో ముఖ్యమైన అడ్డంకి అంతరిక్ష రేడియేషన్‌ను అడ్డుకునేందుకు అమెరికా అంత రిక్ష పరిశోధన సంస్థ నాసా కొత్త సాంకేతికతను రూపొందిస్తోంది. దీంతో అంగారకుడిపైకి సురక్షితంగా, విజయవంతంగా చేరుకునే వీలు కలుగనుంది. రేడియేషన్ కారణంగా అంగారకుడిపైకి మానవులను నాసా పంపలేకపోతోందని కొందరు భావిస్తున్నారని, అయితే అది ఈ పరిస్థితుల్లో తాము విజయం సాధిస్తామని నాసా శాస్త్రవేత్త పాట్ ట్రౌట్‌మాన్ పేర్కొన్నారు. భూమిపై రేడియేషన్ కన్నా అంతరిక్ష రేడియేషన్ చాలా ప్రమాదకరమై నదని నాసా పేర్కొంది.
అంతర్జాతీయ అంత రిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్) రక్షిత భూఅయస్కాంత క్షేత్రంలోనే ఉన్నప్పటికీ అక్కడి వ్యోమగాములు భూమిపై కన్నా పది రెట్ల ఎక్కువ రేడియేషన్‌కు గురవుతున్నారని చెప్పింది. భూఅయస్కాంత క్షేత్రం దాటితే ప్రమాదకరమైన గెలాక్టిక్ కాస్మిక్ కిరణాలు, అంతరిక్ష రేడియేషన్ ఉన్న సోలార్ పార్టికల్ ఈవెంట్స్, వాన్ అలెన్ బెల్టులు ఉంటాయి. గెలాక్టిక్ కాస్మిక్ కిరణాల బారిన పడకుండా కాపాడటం చాలా శ్రమతో కూడుకుంటుందని చెప్పింది. ఇవి గెలాక్సీ అన్ని వైపుల నుంచి వస్తాయని నాసా వివరించింది. వీటికి ఏకంగా లోహాలు, ప్లాస్టిక్, జీవ కణాలను చీల్చేయగలిగేంత శక్తి ఉంటుందని పేర్కొంది.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్‌లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్‌లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్‌తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







