బహ్రెయిన్ లో దోపిడీకి పాల్పడిన పనిమనిషి అరెస్టు

- October 14, 2017 , by Maagulf
బహ్రెయిన్ లో  దోపిడీకి పాల్పడిన పనిమనిషి  అరెస్టు

మనామా : ఇంటి దొంగను ఈశ్వరుడైన పట్టలేరని ఓ సామెత...కానీ మనామా పోలీసులు ఆ చోరకళ ఉన్న పనిమనిషిని గంటల వ్యవధిలో పట్టుకొన్నారు. గవర్నైట్ పరిధిలోని  రాజధానిలో మహిళా సేవకురాలు తనకు ఎవరైతే పని కల్పించారో ఆ యజమాని ఇంటిలోనే  దోపిడీకి పాల్పడిన  ఆఫ్రికన్ దేశానికి చెందిన పని మనిషి  అరెస్టు చేయబడింది. ఈ కేసును చేధించడానికి  కొన్ని గంటల సమయంలోనే పోలీసులు అరెస్టు చేశారు. గవర్నరేట్ పోలీస్ జనరల్ డైరెక్టర్ కల్నల్ ఖలీద్ అల్ తవాది ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఆ పనిమనిషి  తన స్పాన్సర్ ఇంటి నుండి 15, 000 బహెరిన్ దినార్లను దొంగిలించింది. ఈ దోపిడీలో ఆఫ్రికన్ దేశానికి చెందిన మరొక అనుమానితుని సహాయంతో ఆ పనిమనిషి ఈ నేరానికి పాల్పడినట్లు విచారణలో గుర్తించి ఆ వ్యక్తిని అరెస్టు చేసినట్లు తెలిపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com