'లక్ష్మీస్ ఎన్టీఆర్' ప్రమోషన్ మొదలైంది!

- October 17, 2017 , by Maagulf
'లక్ష్మీస్ ఎన్టీఆర్' ప్రమోషన్ మొదలైంది!

ఎన్టీఆర్ ఆత్మ నిత్యం తన కలలోకి వస్తుందని, స్క్రిప్ట్ సహకారం కూడా ఆయనదేనని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన రాం గోపాల్ వర్మ.. తాజాగా తన ఫేస్ బుక్ లో ఎన్టీఆర్ మరణించినప్పుడు లక్ష్మీ పార్వతి విలపిస్తున్న దృశ్యాన్ని, అక్కడే చంద్రబాబు ఉన్న ఫోటోను పోస్ట్ చేశాడు. అలాగే మరో ఫోటోలో ఎన్టీఆర్..లక్ష్మీ పార్వతి మెడలో పూల దండ వేయడాన్ని.., మళ్ళీ అక్కడా చంద్రబాబు ఉన్న దృశ్యాన్ని హైలైట్ చేశాడు. ఇలా వర్మ ఎప్పటికప్పుడు ఈ చిత్రంపై తాను తీవ్రంగా కసరత్తు చేస్తున్న విషయాన్ని చెప్పకనే చెబుతున్నాడు. ఇక ఈ మూవీకోసం అంతా వర్మ అంతా కొత్త నటీనటులనే తీసుకొంటున్నాడని, ముఖ్యంగా సీనియర్ ఎన్టీఆర్ రోల్ వేసే కొత్త యాక్టర్ కి నిర్విరామంగా ట్రైనింగ్ ఇస్తున్నాడని కూడా తెలుస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com