గుడిలో కొలువుదీరనున్న జూ.ఎన్టీఆర్
- October 18, 2017
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కి గుడికతామంటున్నారు అక్కడి ఫాన్స్. నిజానికి ఈ కల్చర్ తమిళనాడులో ఉంది. అక్కడ సినిమా హీరో హీరోయిన్స్‌ని దేవుళ్లుగా ఆరాధిస్తారు. ఈ ట్రెండ్ ఈ మధ్య కాస్త పల్చబడింది. ఇప్పుడు ఆ పనిని కన్నడిగులు చేస్తామంటున్నారు. వరుస విజయాలతో దూసుకెళుతున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజాగా మూడు పాత్రలతో జైలవకుశతో ప్రేక్షకులను మెప్పించి మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. నాలుగు బ్లాక్ బస్టర్స్ టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్, జై లవకుశ చిత్ర విజయాలతో ఉత్సాహంగా ఉన్నాడు. మన తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా ఎన్టీఆర్‌కు మంచి క్రేజ్ ఉంది. పొరుగున ఉన్న కర్ణాటకలో ఎన్టీఆర్‌కు మంచి ఫాలోయింగ్ ఉంది. ఇటీవల ఓ కన్నడ చిత్రం కోసం పాడిన పాట అక్కడి ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. కన్నడ ఫ్యాన్స్‌లో జోష్ని నింపిన ఆపాటతో ఎన్టీఆర్‌కు క్రేజ్ పెరిగిపోయింది. ఎన్టీఆర్‌కు ఇప్పుడు అరుదైన గౌరవాన్ని కల్పించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. ఇంకా ఈ విషయంపై అధికారిక ప్రకటన వెలువడలేదు. కానీ ఈ వార్త సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







