హైదరాబాద్ ఎయిర్‌పోర్టుకు ప్రపంచస్థాయి నంబర్‌వన్ ర్యాంకు
- October 18, 2017
హైదరాబాద్: హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు(ఆర్‌జీఐఏ)కు ప్రపంచస్థాయి నంబర్‌వన్ ర్యాంకు లభించింది. ఏడాదికి 5-15 మిలియన్ల ప్రయాణికుల క్యాటగిరీలో ప్రయాణికులకు అత్యుత్తమ సేవలందిస్తున్నందుకు గాను ఎయిర్‌పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ సర్వీస్ క్వాలిటీ(ఏసీఐ) సంస్థ ఈ గుర్తింపు నిచ్చిందని విమానాశ్రయం యాజమాన్యం జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్(జీహెచ్‌ఐఏఎల్) ఒక ప్రకటనలో వెల్లడించింది.
మారిషస్‌లో మంగళవారం జరిగిన ఒక కార్యక్రమంలో ఏసీఐ డైరెక్టర్ జనరల్ అంజెలా గిటెన్స్ నుంచి ట్రోఫీ అందుకున్నట్లు జీహెచ్‌ఐఏఎల్ సీఈవో ఎస్‌జీకే కిశోర్ తెలిపారు. ఈ గౌరవంతో హైదరాబాద్‌కు మరోసారి ప్రపంచవ్యాప్త గుర్తింపు లభించినట్లయిందని ఆయన వివరించారు. బ్రాండ్ హైదరాబాద్ ఇమేజ్ మరింత పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







