మరో 'లీడర్' గా మహేష్ మెప్పించగలడా?
- October 18, 2017
ప్రస్తుతం కొరటాల శివ సినిమాలో ముఖ్యమంత్రి పాత్రలో తెరకెక్కుతోన్న "భరత్ అనే నేను" షూటింగ్ లో పాల్గొంటున్న ప్రిన్స్ మహేష్ బాబుపై తాజాగా ఓ వార్త ట్రేడ్ వర్గాలలో హాట్ హాట్ గా చక్కర్లు కొడుతోంది. "ఫిదా" సినిమాతో బాక్సాఫీస్ వద్ద బంపర్ హిట్ కొట్టిన శేఖర్ కమ్ముల - మహేష్ బాబు కాంబో ప్రారంభం అయ్యే సూచనలు కనపడుతున్నట్లుగా ఈ వార్తల సారాంశం.
గతంలో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రానా హీరోగా వచ్చిన "లీడర్" సినిమాకు సీక్వెల్ ను మహేష్ బాబుతో శేఖర్ కమ్ముల ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. గతంలోనే వీరిద్దరి కాంబో సెట్స్ పైకి వెళ్ళాల్సి ఉంది. క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ కూడా వీరిద్దరి కాంబోలో ఓ సినిమా రానుందని గతంలో ఓ ప్రముఖ ఇంటర్వ్యూలో స్పష్టం చేసారు. కానీ అది కార్యరూపం దాల్చలేదు.
నిజానికి 'ఫిదా' సినిమాతోనే వీరిద్దరి కాంభినేషన్ తెరపైకి రావాల్సి ఉంది. కానీ ఆ కధకు ప్రిన్స్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోయినప్పటికీ, శేఖర్ కమ్ములతో ఓ సినిమా చేయాల్సి ఉందని గతంలో వివిధ ఇంటర్వ్యూలలో ప్రిన్స్ కూడా స్పష్టం చేసారు. అయితే ఆ తరుణం ప్రస్తుతం ఆసన్నమైందని, 'లీడర్' సినిమాకు సీక్వెల్ కధను రాసే పనిలో ఉన్నారని, ఇది మహేష్ తోనే తెరకెక్కనుందన్న వార్త ట్రేడ్ వర్గాలను షేక్ చేస్తోంది.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









