డిసెంబర్ 1న రానున్న జవాన్.!
- October 19, 2017
అతి తక్కువ టైం లో మెగా హీరో అనిపించుకున్న హీరో సాయి ధరమ్ తేజ్..రేయ్ తో నిరాశ పరిచిన కానీ ఆ తర్వాత వరుస విజయాలతో తన దూకుడును కనపరిచాడు. ఇటీవల నక్షత్రం మూవీ లో గెస్ట్ రోల్ లో కనిపించి మెగా ఫ్యాన్స్ ను అలరించిన ఇతడు త్వరలో బివిఎస్ రవి దర్శకత్వం లో జవాన్ అంటూ రాబోతున్నాడు.
ఇప్పటికే రిలీజ్ అయినా ఫస్ట్ లుక్ పోస్టర్స్ , టీజర్ తో సినిమా ఫై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ నేపథ్యం లో ఈ సినిమా సెప్టెంబర్ నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతుందని ప్రకటించినప్పటికీ , కథ లో కొన్ని మార్పులు చేయడం తో సినిమా రి షూట్ చేయడానికి నిర్ణయించారు. దాంతో సినిమా ముందుగా అనుకున్న టైం కు కాకుండా డిసెంబర్ 1న ఈ సినిమా రిలీజయ్యే అవకాశాలున్నట్టు తెలుస్తోంది.
ఈ వార్తపై పూర్తి క్లారిటీ రావాలంటే నిర్మాణ సంస్థ నుండి అధికారిక ప్రకటన వెలువడే వరకు వచ్చి చూడాల్సిందే. అరుణాచల్ క్రియేషన్స్ బ్యానర్ పై కృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రంలో మెహ్రీన్ కౌర్ హీరోయిన్ గా కనిపించనుంది. తేజ్ ఈ సినిమాలో దేశమా, కుటుంబమా అనే సంఘర్షణను ఎదుర్కునే ఒక భాద్యత గల యువకుడి పాత్రలో కనిపించనున్నాడు. అలాగే వినాయక్ దర్శకత్వం లో మరో సినిమా చేస్తున్నాడు తేజు.
తాజా వార్తలు
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్







