జీవా 'కీ' తెలుగు టీజర్ విడుదల.!
- October 19, 2017_1508418420.jpg)
'మీ ఫోన్లో ఇంటర్నెట్ ఉంటే మీరు మాత్రమే ప్రపంచాన్ని చూస్తున్నట్లు కాదు. ప్రపంచం మిమ్మల్ని కూడా చూస్తున్నట్టే' అంటున్నారు తమిళ కథానాయకుడు జీవా. 'రంగం' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన ఆయన నటించిన తాజా చిత్రం 'కీ'. కంట్రోల్ ఆల్ట్ డై అనేది ఉప శీర్షిక. నిక్కీ గల్రాని కథానాయిక.కలీస్ దర్శకుడు. సైన్స్ ఫిక్షన్ సైకలాజికల్ థ్రిల్లర్‌గా ఈ సినిమా తెరకెక్కింది. దీపావళి సందర్భంగా 'కీ' తెలుగు టీజర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. 'మీరు ఎప్పుడు ఏడుస్తారు.. ఎప్పుడు నవ్వుతారు.. ఎప్పుడు ఐ లవ్‌వ్యూ చెబుతారోనని మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటారు. ఇక ఎవ్వరూ తప్పించుకోలేరు' అంటూ వినిపించే సంభాషణలు సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి.
ఇటీవల కాలంలో ప్రపంచవ్యాప్తంగా వార్తల్లో నిలిచిన ఆట బ్లూవేల్. ఈ నేపథ్యంతోనే తాజా చిత్రం తెరకెక్కినట్లు తెలుస్తోంది. విశాల్ చంద్రశేఖర్ ఈ చిత్రానికి స్వరాలు సమకూర్చారు. కృష్ణ క్రియేషన్స్ బ్యానర్‌లో శ్రీ వెంకటేశ్వర ఫిల్మ్స్ పతాకంపై మైకేల్ రాయప్పన్ నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
_1508418404.jpg)
_1508418436.jpg)
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







