భారతీయులందరికి కృతఙ్ఞతలు : థెరెసా మే
- October 19, 2017
బ్రిటిష్ సమాజానికి నిరుపమానమైన సేవలు అందిస్తున్నందుకు భారతీయులకు బ్రిటన్ ప్రధానమంత్రి థెరిసా మే కృతజ్ఞతలు తెలిపారు. యునైటెడ్ కింగ్‌డమ్ గొప్ప దేశంగా మన్ననలు అందుకోవడంలో భారతీయులు ఉజ్వలమైన ఉదాహరణ అని ఆమె కొనియాడారు.
దీపావళి సందర్భంగా బ్రిటన్‌లోని భారతీయులకు శుభాకాంక్షలు తెలుపుతూ.. ప్రత్యేక సందేశాన్ని అందించారు. చెడుపై మంచి, నిరాశపై ఆశ, చీకటిపై వెలుగు విజయం సాధిస్తుందన్న దివ్వెల పండుగ సందేశం.. అన్ని విశ్వాసాల ప్రజల్లో ప్రతిఫలిస్తుందని ఆమె పేర్కొన్నారు.
'ప్రధానమంత్రిగా ఈ సందర్భంలో మొత్తం దేశం తరుఫున మీకు థాంక్స్ చెప్తున్నా. యునైటెడ్ కింగ్‌డమ్‌లోని ప్రతి జీవనరంగంలోనూ మీరు విశేషమైన సేవలు అందించారు' అని డౌనింగ్ స్ట్రీట్ విడుదల చేసిన పత్రికాప్రకటనలో ఆమె పేర్కొన్నారు. బ్రిగ్జిట్ చర్చల కోసం థెరిసా మే ప్రస్తుతం బ్రసెల్స్‌లో ఉండటంతో భారత సంతతి తొలి బ్రిటన్ కేబినెట్ మినిస్టర్ ప్రీతి పటేల్ ఆధ్వర్యంలో 0 డౌనింగ్ స్ట్రీట్‌లో గతవారం నిర్వహించిన దీపావళి వేడుకల్లో ఆమె పాల్గొనలేదు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







