కాలుష్యంలో ఇండియానే టాప్..

- October 20, 2017 , by Maagulf
కాలుష్యంలో ఇండియానే టాప్..

ఇండియాలో కాలుష్యం పెరిగిపోతున్నది. ఒక్క 2015లోనే కాలుష్య సంబంధిత రోగాల కారణంగా ఇండియాలో 25 లక్షల మంది మృత్యువాత పడ్డారు. ఈ విషయంలో ప్రపంచంలోనే ఇండియా తొలి స్థానంలో ఉంది. తాజాగా జరిగిన ఓ అంతర్జాతీయ స్థాయి అధ్యయనం ఈ చేదు నిజాన్ని వెల్లడించింది. 2015లో ఎయిడ్స్, టీబీ, మలేరియా రోగాల వల్ల చనిపోయిన వారి కంటే కాలుష్యం బారిన పడి చనిపోయిన వారి సంఖ్య మూడు రెట్లు ఎక్కువగా ఉండటం గమనార్హం. అందులోనూ వాయు కాలుష్యం వల్లే 18 లక్షల మంది చనిపోయారు. ఇందులోనూ ఇండియానే టాప్. అదే ఏడాది నీటి కాలుష్యం వల్ల మరో 6.4 లక్షల మంది చనిపోయినట్లు ఈ నివేదిక వెల్లడించింది. ఇందులో 70 శాతం మరణాలు, గుండె సంబంధిత, శ్వాసకోశ వ్యాధుల వల్లేనని ఈ అధ్యయనం తేల్చింది. ప్రతి దేశంలోనూ కాలుష్యం బారిన పడి ఎక్కువగా చనిపోతున్నది బలహీన వర్గాలే. ద లాన్సెట్ అనే సంస్థ ఈ స్టడీ నిర్వహించింది. ప్రపంచంలో వాయు కాలుష్యం వల్ల చనిపోయిన వారిలో 50 శాతానికిపైగా ఇండియా, చైనా వాళ్లేనని ఈ అధ్యయనం స్పష్టంచేసింది. ఇక ఈ కాలుష్యం వల్ల రోగాలు పెరిగి మెడికల్ ఖర్చులు కూడా తడిసి మోపెడవుతున్నాయి.

ప్రపంచంలోని పది మంచి పేరున్న దేశాలను చూస్తే కాలుష్యం కారణంగా ఎక్కువగా చనిపోతున్న వారు ఇండియా, బంగ్లాదేశ్‌లలోనే ఎక్కువగా ఉన్నారు. అంతేకాదు మరింత ఆందోళన కలిగించే విషయం ఏంటంటే.. రానున్న రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా కాలుష్య మరణాలు 50 శాతం వరకు పెరిగే ప్రమాదం ఉందని కూడా ఈ స్టడీ తేల్చింది. అంటే 2050లో ఈ మరణాలు 42 లక్షల నుంచి 66 లక్షలకు చేరే ప్రమాదం ఉంది.

ముఖ్యంగా ఇండియా ఉన్న దక్షిణాసియా, తూర్పు ఆసియా నగరాల్లో కాలుష్యం వేగంగా పెరగనుందని అంచనా వేసింది. ప్రపంచవ్యాప్తంగా కాలుష్యం బారిన పడి మరణిస్తున్న వారి సంఖ్య 16 శాతం పెరగగా.. అందులో ఇండియాలాంటి తక్కువ, మధ్య ఆదాయ దేశాల్లోనే 92 శాతం మరణాలు నమోదయ్యాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com